RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే వివిధ రాష్ట్రాలలో పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ విధంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశారు. ఇకపోతే తాజాగా రాజమౌళి ఈ సినిమా గురించి ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో తారక్ కొమరంభీం పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించారు.
ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి తారక్ తెలుగులో ఒక రోజు మాత్రమే కేటాయించారు. కేవలం ఒకే ఒక రోజులో డబ్బింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకున్నారు. అలాగే హిందీలో రెండు రోజులు, తమిళంలో మూడు రోజుల పాటు ఈ సినిమాకి సమయం కేటాయించారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కల రేపటితో తీరనుంది.