Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అఖిల్ హమీదా మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రైనింగ్ లైక్స్ అనే టాస్క్ లో గాల్లో నుంచీ వచ్చే లైక్స్ ని సంపాదించి జాగ్రత్తగా పెట్టుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు ఎన్ని లైక్స్ బటన్ సాధించారో తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అఖిల్ హమీద మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఈ టాస్క్ లో భాగంగా గాల్లో నుంచి ఒక లైక్ బటన్ రావడంతో హమీద దానిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అఖిల్ దానిని తీసుకున్నారు. అదేవిధంగా మరొక లైక్ బటన్ రావడంతో హామీద దాని పై కాలు పెట్టి తొక్కి పట్టుకుంది.వెంటనే అఖిల్ తన కాలు పక్కకు తీసి దానిని సొంతం చేసుకున్నారు. దీంతో హామీద అఖిల్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
అఖిల్ ఉద్దేశపూర్వకంగానే తనతో గొడవ పడ్డారని తన కాలు తొడ భాగంలో పట్టుకొని కాలు పక్కకి తీశాడు అంటూ ఆరోపించింది. ఇలా హామీద చేసిన ఈ వ్యాఖ్యలపై అఖిల్ స్పందిస్తూ తాను అలా పట్టుకోలేదని తనకు ఎలాంటి ఉద్దేశ్యం లేదని వాదించాడు. అయితే ఈ లైక్ బటన్ పట్టుకోవడం కోసం హమీద మైక్ తీయకుండా స్విమ్మింగ్ పూల్ లో దూకింది. ఇలా దూకడంతో బిగ్ బాస్ తన దగ్గర ఉన్న లైక్ బటన్స్ అన్ని తీసేసుకున్నారు. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న హమీద్ ఆ విషయంలో అఖిల్ ఇలా చేయడంతో తీవ్రస్థాయిలో తనపై రెచ్చిపోయింది. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. అయితే వీరిలో ఎవరు ఈ వారం కెప్టెన్సీగా గెలుస్తారో తెలియాల్సి ఉంది.