Health Tips : సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న సమస్యలలో దంతాల సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు శరీరంలో తక్కువ శాతం ఉండటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. పళ్ళు పుచ్చి పోవడం, చిగుళ్ళ నుండి రక్తస్రావం, దంతాల నొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి.ఈ సమస్యల కోసం డాక్టర్ దగ్గర సలహా తీసుకొని కొన్ని పద్దతులు పాటించడం ద్వారా దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
సాధారణంగా దంతాల సమస్యలతో బాధపడేవారు డాక్టర్ దగ్గరికి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ మన ఇంట్లో అందుబాటులో ఉండే దాల్చిన చెక్క, లవంగాల ద్వారా దంతాలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు . పంటి నొప్పి సమస్యతో బాధపడేవారు నొప్పి ఉన్న ప్రదేశంలో లవంగం నమిలి ఉంచుకోవాలి.ఇలా చేయటంవల్ల కాసేపటి తర్వాత నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పంటి నొప్పి సమస్యలకు లవంగం మాత్రమే కాకుండా లవంగం నూనె కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
పంటి నొప్పి సమస్యలను దాల్చినచెక్క ద్వారా కూడా నయం చేయవచ్చు.మొదటగా దాల్చిన చెక్క వేసి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పంటి నొప్పి, పళ్ళు పుచ్చి పోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి కలిపి ఆ నీటిని పుక్కిలించాలి. నాలుగు రోజులు పాటు ఐదు నిమిషాలు ఇలా చేయటం వల్ల దంత సమస్యలను దూరం చేయవచ్చు.
దంతాల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపుకొని నాలుగైదు సార్లు పుక్కిలించాలి. రోజు ఇలా చేయటం వల్ల దంతాల సమస్యలు తగ్గటమే కాకుండా నోటి దుర్వాసన సమస్య కూడా దూరమవుతుంది. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం.
Read Also : Health Tips: ముల్లంగి ఆకులను పడేస్తున్నారా? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్…!