Health Tips: సాధారణంగా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కూరగాయలతో మాత్రమే కాకుండా వాటి ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగి ఆకులను చాలామంది పారేస్తూ ఉంటారు. కానీ ముల్లంగి ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయ పడతాయి. ముల్లంగి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముల్లంగి ఆకుల లో ఐరన్ క్యాల్షియం, పోలిక్ యాసిడ్ విటమిన్ సి వంటి మన శరీరానికి అవసరమైన అనేక రకాల ఖనిజాలు, పోషక విలువలు ఉంటాయి. ముల్లంగి ఆకుల లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ముల్లంగి తో పోల్చితే ముల్లంగి ఆకుల లోనే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరంలోని జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు నిర్మూలించడానికి ఉపయోగపడతాయి.
ఫైల్స్ సమస్యతో బాధపడేవారికి కూడా ముల్లంగి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఫైల్స్ సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని ఉంచాలి. ముల్లంగి ఆకుల పొడి పంచదార సమపాళ్ళలో వేసి నీటితో కలిపి గుజ్జులా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఆ మిశ్రమం తినటం వల్ల ఫైల్స్ సమస్య నుండి తొందరగా విముక్తి పొందవచ్చు.
క్యాన్సర్ నిర్మూలించడంలో కూడా ముల్లంగి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ముల్లంగి ఆకులను శుభ్రంగా కడిగి, నీటిలో బాగా ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల ముల్లంగి ఆకుల లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు క్యాన్సర్ కణాల మీద దాడి చేసి క్యాన్సర్ సమస్య నుండి విముక్తి కలిగిస్తాయి.