...

Karthika Deepam : డాక్టర్ అంజలి ఇంట్లో వంటలు చేస్తున్న కార్తీక్‌ను చూసేసిన మోనిత.. ఏం జరగనుంది?

Karthika deepam Feb 5 Episode Today : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ రోజురోజుకీ మరింత ఇంట్రెస్ట్ గా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక బర్త్డే పార్టీ కి బయలుదేరిన మోనిత, భారతి లు అంజలి ఇంటికి వెళ్లనే వెళుతారు. అక్కడ బర్త్డే పార్టీ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మోనిత కూడా చేస్తూ ఉంటుంది.

ఆ క్రమంలో అంజలి, మోనిత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసి నీకు పెళ్లి అయ్యిందా అని అడుగుతుంది. దానికి మోనిత అవును అని సమాధానం చెబుతుంది. ఇక అంజలి మీ వారు ఏం చేస్తారు? అని మోనిత ను అడగగా మా వారు కూడా డాక్టరే.. అతనొక కార్డియాలజిస్ట్ అని మోనిత చెబుతుంది.

doctor-anjali-home-party-monita-saw-karthik-by-cooking-at-home-what-will-happen
doctor-anjali-home-party-monita-saw-karthik-by-cooking-at-home-what-will-happen

ఆ మాటకు అంజలి.. మరి ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ గారు మీ వారికి తెలిసి ఉండాలే..అని అడిగితే దానికి మోనిత డాక్టర్ కార్తీక్ ఏ నా భర్త అని చెబుతుంది. దానికి అంజలి ఎంతో ఆశ్చర్యపోతుంది. మరి డాక్టర్ కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చారు అని అంజలి చెప్పగా మోనిత ఎంతో ఆశ్చర్యపోతుంది.

ఒకవైపు కార్తీక్ దీపలు, అంజలి ఇంటికి వంటలు చేయడానికి రానే వస్తారు. వాళ్ళిద్దర్నీ అంజలి రిసీవ్ చేసుకుని ఇంటి వెనకాల వంటల కార్యక్రమం స్టార్ట్ చేయండి అని చెబుతుంది. దాంతో వారిద్దరూ ఇంటి వెనకాల వంటలు వంటలు చేయడానికి వెళ్తారు. ఇక కార్తీక ఊర్లోనే ఉన్నాడు. అని తెలిసిన మోనిత ఆనందానికి అంతులు ఉండవు.

Karthika deepam Feb 5 Episode Today : కార్తీక్ ను చూసేసిన మోనిత.. ఈ రోజు ఎపిసోడ్ ఇదే… 

మరోవైపు కార్తీక్, దీప లు ఆనందంగా వంటలు చేస్తూ ఉంటారు. ఇక మోనిత నా కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని బయలుదేరగా భారతి ఇది సరైన సమయం కాదని నచ్చచెబుతుంది. ఈలోపు డాక్టర్ అంజలి, మోనిత దగ్గరికి వచ్చి వంటల్లో ఉప్పు, కారం ఎలా ఉన్నాయో చూసి రమ్మంటుంది.

doctor-anjali-home-party-monita-saw-karthik-by-cooking-at-home-what-will-happen
doctor-anjali-home-party-monita-saw-karthik-by-cooking-at-home-what-will-happen

ఇక మోనిత ఏ మాత్రం విసుగు చెందకుండా ఉప్పు కారం చూడడానికి వంటల దగ్గరికి వెళుతుంది. అక్కడికి వెళ్లగానే అక్కడ వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసి మోనిత ఒక రేంజ్ లో స్టన్ అవుతుంది. మరి ఈ క్రమంలో మోనిత కార్తీక్ కాదు ఊహ అని భ్రమ పడుతుందో లేక నిజంగానే కార్తీక్ అని ఆశ్చర్యపోతుందో.. తెలియాలి అంటే రేపటి భాగం కోసం వేచి చూడాల్సి ఉంది.

Read Also : Karthika Deepam : మోనిత, భారతిలు వస్తున్న పార్టీకి వంటలు చేయడానికి ఒప్పుకున్న వంటలక్క!