...

Karthika Deepam : మోనిత, భారతిలు వస్తున్న పార్టీకి వంటలు చేయడానికి ఒప్పుకున్న వంటలక్క!

Karthika Deepam Feb 4 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకు బాగా ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. డాక్టర్ కార్తీక్ వైద్యం చేయడానికి వచ్చినందుకు ఆ హాస్పిటల్ లో డాక్టర్లు వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. ఇక కార్తీక్ సౌర్య కు వైద్యం స్టార్ట్ చేస్తాడు.

monita-and-bharathi-going-to-the-party-and-deepa-get-contracts-to-do-food-to-that-partys
monita-and-bharathi-going-to-the-party-and-deepa-get-contracts-to-do-food-to-that-partys

కార్తీక్ లోపల ఆపరేషన్ థియేటర్ లో సౌర్య కు వైద్యం చేస్తున్న సంగతి దీపకు తెలియదు. కార్తీక్ ఆపరేషన్ చేసే సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అని దీప టెన్షన్ పడుతుంది. మరోవైపు మోనిత, భారతి లు అంజలి వాళ్ల ఊరికి బర్త్డే పార్టీ కి వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఈలోపు కార్తీక్ సౌర్య కు వైద్యం పూర్తి చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ కార్తీక్ వైద్యం చేయడానికి వచ్చాడు అని హాస్పిటల్ స్టాప్ ధన్యవాదములు తెలియజేస్తారు.

ఇక బయటకు వచ్చిన కార్తీక్ ను చూసి దీప ఎవరో తెలియక దండం పెడుతుంది. ఆ తర్వాత కార్తీక్ అని తెలిసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోవైపు రుద్రాణి ఆపరేషన్ సక్సెస్ అయిన సంగతి తెలిసి తన తమ్ముళ్ల మీద మండి పడుతోంది. రుద్రాణి ఆ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈలోపు సౌర్య సృహ లోకి వస్తుంది.

Karthika Deepam Feb 4 Episode Today :  బర్త్ డే పార్టీలో దీపకు మోనిత ఎదురవుతుందా? 

ఇక సౌర్య బాధ పడుతూ ఉండగా.. నీకేం కాదమ్మా ఒక గొప్ప డాక్టర్ నీకు వైద్యం చేశాడు అని ధైర్యం చెబుతుంది. దానికి సౌర్య ‘ఛాతి దగ్గర నొప్పిగా ఉంది నాకు ఏదైనా ఆపరేషన్ చేశారా.. డబ్బులు ఎక్కడికి అమ్మా అని అడుగుతుంది. దానికి దీప ఎంతో బాధపడుతుంది. ఇక సౌర్య కు దీప ఎదో ఒకటి చెప్పి నచ్చ చెబుతుంది.

మరోవైపు మోనిత, భారతి లు బర్త్డే పార్టీ కి స్టార్ట్ అవుతారు. ఒకవైపు కార్తీక్ ఆ లేడీ డాక్టర్ సహాయం చేసినందుకు మీ మేలు మర్చిపోలేం డాక్టర్ అని చేతులెత్తి దండం పెడతాడు. ఇక అంజలి ‘ మీ వల్ల డాక్టర్ కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చారు అన్న సంగతి మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ఆ డాక్టర్ చెబుతుంది.

ఆ తర్వాత డాక్టర్ దీప, వంటలు ప్రత్యేక తెలిసి వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ సందర్భంగా వంటలు చేయడానికి పిలుస్తుంది. దానికి దీప మీరు మాకు ఇంత సహాయం చేశారు మీకు ఆ మాత్రం సహాయం చేయడం మాకు సంతోషం అని చెబుతుంది. చెప్పాల్సిన విషయం ఏమిటంటే మోనిత, భారతి లు వచ్చేది ఆ బర్త్డే పార్టీ కే మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Karthika Deepam : కార్తీక్ కోసం మోనిత ఆరాటం.. కూతురి ప్రాణాలు కాపాడుకున్న డాక్టర్ కార్తీక్.. సంతోషంలో దీప!