...

7th Pay Commission Big Update : ఇదే జరిగితే.. ఉద్యోగులకు నిజంగా శుభవార్తే.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.2 లక్షలు?

7th Pay Commission Big Update : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతుందా? నివేదికలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు (DA Arrears) అరియర్స్ చెల్లించాల్సిన అంశంపై కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కరోనా పరిస్థితుల్లో కేంద్రం ఉద్యోగులకు అరియర్స్‌ను నిలిపేసిన సంగతి తెలిసేందే.. రెండేళ్ల నుంచి ఉద్యోగులకు అరియర్స్ అందలేదు.

ఈ క్రమంలోనే మోదీ సర్కార్ ఉద్యోగులకు డీఏ అరియర్స్ (DA Arrears) చెల్లించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ (Union Budget 2022) అనంతరం కేంద్ర కేబినెట్ ఉద్యోగులకు అరియర్స్‌గా ఒకేసారి వారి అకౌంట్లలో రూ.2 లక్షల చెల్లించాలనే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం.

DA Update 7th Pay Commission : డీఏ అరియర్స్‌పై బిగ్ అప్ డేట్..!  

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నివేదికలపై స్పందించలేదు. అరియర్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అందులోనూ ఆరియర్స్ కేంద్రం కచ్చితంగా చెల్లిస్తుందనడానికి కచ్చితంగా చెప్పలేం కూడా. డియర్‌నెస్ అలవెన్స్ (DA) అనేది ప్రతి ఏడాది 2 సార్లు పెంచుతారు.

జనవరిలో ఒకసారి, జూలైలో రెండోసారి డీఏను సవరిస్తుంటుంది. ఈ ఏడాది జనవరిలో DA పెంచలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 31 శాతం డీఏను అందిస్తోంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం గతంలో డీఏ అరియర్స్ ఉండవని తేల్చి చెప్పేసింది. ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో.. ప్రభుత్వం అరియర్స్ చెల్లించే అవకాశం లేకపోలేదని నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగులు ఆశించినట్టుగా కేంద్ర ప్రభుత్వం వారికి ఆరియర్స్ చెల్లించే అంశంపై నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.

Read Also : Karthika deppam: మోనిత, భారతి లు వస్తున్న పార్టీకి వంటలు చేయడానికి ఒప్పుకున్న వంటలక్క!