...

50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే?

50 Days Pushpa Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేశాడు.

సునీల్, అనసూయ ప్రముఖ పాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ లో దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది.

బాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమా రిలీజ్ అయినా కొన్ని రోజులకే అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయినా థియేటర్స్ లో మాత్రం సందడి తగ్గలేదు. బాలీవుడ్ లో అయితే రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో థియేటర్స్ లో అఖండ తర్వాత 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ‘పుష్ప’ మాత్రమే. చెప్పాలంటే ‘పుష్ప’ సినిమా తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా సక్సెస్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు బన్నీ నటనకి ఫిదా అయిపోతున్నారు.

ఇక ఈ సినిమా లోని సాంగ్స్, డైలాగ్స్ ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా మరోసారి ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ‘పుష్ప’ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Read Also : Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !