...

Samantha Comments : చైతూ క్యారెక్టర్‌పై సమంత షాకింగ్ కామెంట్స్.. ఎలాంటివాడో అప్పుడే తెలిసింది..!

Samantha Comments : నాగచైతన్య, సమంత బ్రేకప్ తర్వాత ఎన్నో రుమర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇంతకీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందనేది ఇప్పటికి చాలామందికి అర్థం కాని పరిస్థితి.. అక్టోబ‌ర్ 2న అధికారికంగా సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు చైతూ, సామ్ తమ విడాకుల ప్రకటన వెల్లడించారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరొందిన చైసామ్ జంట..

4ఏళ్ల తమ పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. చైసామ్ విడాకుల విషయంలో నాగర్జునను కూడా లాగేసరికి ఆయనే స్వయంగా వచ్చి తాను ప్రమేయం ఏమి లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం కేవలం ఇద్దరి భార్యభర్తల మధ్య జరిగింది తప్పా తన జోక్యం ఎక్కడా లేదని కింగ్ నాగర్జున సైతం స్పష్టం చేశారు.

Samantha Comments : నాగచైతన్య అలా ఆదుకున్నాడట..

చైసామ్ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవించాను అంతేనన్నారు. అది తన బాధ్యత కూడా చెప్పుకొచ్చారు నాగ్.. ఇప్పటివరకూ చైతూ, సామ్ అభిమానుల నుంచి చాలామంది వారిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అనుకున్నారంతా.. కానీ, పరిస్థితులు చూస్తుంటే.. వీరిద్దరూ మళ్లీ కలిసే పరిస్థితి లేదని తెలుస్తోంది.

విడాకులు తర్వాత.. నాగ చైతన్య క్యారక్టర్‌‌పై సమంత ఇంటర్వ్యూలో షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తన దగ్గర డబ్బులు లేని సమయంలో చైతూ తనకు అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది చైతూతో కలిసి షూటింగ్‌ చేసే సమయంలో తన దగ్గర అమ్మకు ఫోన్ కాల్‌ చేసే పరిస్థితి లేదని, ఆ సమయంలో తాను మాట్లాడేందుకు కనీసం డబ్బులు కూడా లేవని తెలిపింది.

తన పరిస్థితిని అర్థం చేసుకుని చైతన్యనే ముందుకు వచ్చి తన ఫోన్‌ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఎంతసేపైనా ఫోన్ మాట్లాడుకోవచ్చునని చెప్పాడు. నాగచైతన్య ఫర్‌ ఫెక్ట్‌ జెంటిల్ మ్యాన్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ఆర్థికంగా కూడా చైతూ తనను ఆదుకున్నాడని సమంత చెప్పుకొచ్చింది.

Read Also : Sreeja Kalyan : ఆ హీరోయిన్‌తో చనువుగా ఉండటం వల్లే శ్రీజ కళ్యాణ్‌కు విడాకులు ఇవ్వనుందా?