#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

,

Joint Account : మీ భర్తతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? ఈ ఒక్క రూల్ మిస్ అయితే పెద్ద తలనొప్పి!

By Ramesh Babu

Published on: February 27, 2026

Follow Us

Joint Account

---Advertisement---

  • భార్యాభర్తలిద్దరూ జాయింట్ అకౌంట్ కలిసి ఓపెన్ చేయొచ్చా?
  • ఎయిదర్ ఆర్ సర్వైవర్ పథకం ఇబ్బందులేంటి?
  • వ్యక్తిగతంగా అకౌంట్లో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
  • ఇద్దరిలో ఒకరు మరణించిన సందర్భంలో డబ్బులు పొందొచ్చు

Joint Account : జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? కాస్త ఆగండి. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. సాధారణంగా భార్యాభర్తలు జాయింట్ బ్యాంకు అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఇతర పెట్టుబడులను కోసం ఓపెన్ చేస్తే బ్యాంక్ ‘ఎయిదర్ ఆర్ సర్వైవర్’ అనే నిబంధనను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తుంది.

దీనికి కారణం చాలా ఈజీ ప్రాసెస్ కావడమే. బ్యాంకు (Joint Account) కార్యకలాపాలు కూడా చాలా ఈజీ అవుతాయి. ఇద్దరిలో ఎవరైనా వ్యక్తిగతంగా అకౌంట్లో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరమైతే ఎవరికైనా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఇద్దరిలో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు మొత్తం బ్యాలెన్స్‌ను ఈజీగా క్లెయిమ్ చేయవచ్చు.

ఈ విధానం చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ, ఇక్కడే అతిపెద్ద సమస్య ఎదురవుతుంది. ‘ఎయిదర్ ఆర్ సర్వైవర్ ‘ అంటే అకౌంట్ ఉన్న ఇద్దరూ జీవించి ఉన్నప్పుడు స్వతంత్రంగా ఎవరైనా నిర్వహించుకోవచ్చు. వారిలో ఒకరు మరణిస్తే మాత్రం బతికి ఉన్న వ్యక్తికి మొత్తాన్ని చెల్లించడానికి బ్యాంకుకు అధికారం ఉంటుంది.

బ్యాంకు చట్టపరమైన బాధ్యత అక్కడితో ముగుస్తుంది. కానీ, ముఖ్యంగా, ఈ జాయింట్ అకౌంట్ విధానం బ్యాంకింగ్ కార్యకలాపాలకు మాత్రమే సంబంధించింది. అందులో డబ్బులు ఎవరికి చెందాలి అనేది మాత్రం వాస్తవ చట్టపరంగా నిర్ణయించదు.

Joint Account : చట్టపరంగా డబ్బుపై ఎవరికి హక్కు :

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తి అతని చట్టబద్ధమైన వారసులకు వెళ్తుంది. వీలునామా ఉంటే ఆస్తి తదనుగుణంగా విభజిస్తారు. వీలునామా లేకపోతే హిందూ వారసత్వ చట్టం లేదా భారతీయ వారసత్వ చట్టం వంటి వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.

Read Also : iQOO 15R Launch : 7600mAh భారీ బ్యాటరీతో కొత్త iQOO 15R వచ్చేసింది, ఖతర్నాక్ ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు

దీని అర్థం.. భర్త తన సంపాదనను జాయింట్ అకౌంటులో డిపాజిట్ చేసి మరణిస్తే, భార్య బ్యాంకు నుంచి డబ్బును పొందవచ్చు. కానీ, పిల్లలు, తల్లిదండ్రులు లేదా ఇతర చట్టపరమైన వారసులు కోర్టులో క్లెయిమ్ చేసేందుకు అర్హులు కారు.

డబ్బు ఎలా నిలిచిపోతుంది? :
“ఎయిదర్ ఆర్ సర్వైవర్” పథకం కింద భార్య మొత్తం డబ్బును తీసేసుకుందని అనుకుందాం. ఆ తర్వాత పిల్లలు లేదా ఇతర వారసులు కోర్టుకు వెళతారు. కోర్టు స్టే ఆర్డర్ జారీ చేయవచ్చు.

లేదంటే ఆ అకౌంట్ స్తంభింపజేయవచ్చు లేదా భార్య డబ్బులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వమని కోరవచ్చు. చాలా సందర్భాలలో, సర్వైవర్ డబ్బును ఎందుకు విత్ డ్రా చేశారో పూర్తి వివరణ ఇవ్వాలి. కుటుంబ వివాదాలు, చట్టపరమైన నోటీసులు, సుదీర్ఘ వ్యాజ్యం ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి.

నామినీ, నిబంధన మధ్య తేడా ఏంటి? :

నామినీ అంటే అసలు మరణించిన తర్వాత అంతిమ యజమానిగా ఉంటారు. అసలు వాస్తవం ఏంటంటే.. నామినీ డబ్బును పొందడానికి ఒక మార్గం మాత్రమే. వాస్తవ యాజమాన్య హక్కులు చట్టపరమైన వారసులకే వర్తిస్తాయి. ‘నామినీ అనే వ్యక్తి ఎవరైనా సరే నిబంధన మాత్రం వారసుల హక్కులకు లోబడి ఉంటుంది.

Joint Account : జాయింట్ అకౌంటుతో సమస్యలివే :

దంపతులు ఇద్దరు విడిపోతే ఒకరు మరొకరి అనుమతి లేకుండా మొత్తం జాయింట్ అకౌంటులో డబ్బును తీసేసుకోవచ్చు. విడాకులు తీసుకున్న సందర్భంలో డబ్బు ఎవరిది అని నిరూపించడం చాలా కష్టం. పెద్ద మొత్తాలు పన్ను, వారసత్వ సమస్యలకు కూడా దారితీయవచ్చు.

భవిష్యత్తులో గొడవలు రాకుండా ఏం చేయాలి? :
జాయింట్ అకౌంట్లు, పెట్టుబడి మొత్తాలకు సంబంధించి స్పష్టమైన వీలునామా రాసుకోవడం చాలా సేఫ్. పెద్ద పెట్టుబడులు, సరైన నామినేషన్ల కోసం ప్రత్యేక అకౌంట్లు కలిగి ఉండటం తెలివైన పని. ఆస్తికి సంబంధించి కుటుంబంలో వివాదాలు ఉంటే అకౌంట్ ఓపెన్ చేసే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి.

, , , ,