Father Son Agreement : ఆరేళ్ల బుడతడు.. కానీ, తెలివిలో అతడికి అతడే సాటి.. తన నచ్చిన పనులను చేసేందుకు అనుమతి కోసం ఏకంగా కన్నతండ్రితోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. రూ.100 అడిగితే తాను చెప్పినట్టు చేస్తేనే ఇస్తానని తండ్రి చెప్పడంతో ఆ పనులు చేసేందుకు ఆరేళ్ల బాలుడు అంగీకరించాడు. సరిగా వారం రోజుల పాటు బుద్ధిగా చేస్తే తాను అడిగిన రూ.100 కోసం పనులు చక్కగా పూర్తి చేశాడు.
అగ్రిమెంట్ లో భాగంగా 7 రోజులపాటు తండ్రి చెప్పినట్టే నడుచుకున్నాడు. ఇప్పుడా తండ్రీకొడుకల అగ్రిమెంట్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అగ్రిమెంట్ చూసిన నెటిజన్లు సరదగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆరేళ్ల కొడుకును కంట్రోల్ చేసేందుకు తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి కొడుకుతో డీల్ కుదర్చుకున్నాడు. ఇలాగైనా దారిలోకి వస్తాడని ఓ ప్రయత్నంగా చేశాడు. ఫలించింది. కుమారుడు దిగొచ్చాడు. ఇంతకీ ఆ తండ్రి ఇచ్చిన అగ్రిమెంట్ లో ఏముందంటే.. ఒక టైం టేబుల్ తయారుచేశాడు తండ్రి..
అందులో ప్రతిరోజు ఉదయం ఏ టైంకు నిద్రలేవాలి.. ఆ రోజంతా ఏం చేయాలి.. రాత్రి ఎపుడు పడుకోవాలి అనే వివరాలు మొత్తం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేశాడు. ప్రతిదానికి ఏడ్వకూడదు.. అలర్లి చేయకూడదు.. గొడవ చేయొద్దు.. రోజూ ఇదే టైం టేబుల్ పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే రోజుకు రూ.10 ఇస్తానని స్పష్టం చేశాడు.
వారం రోజులపాటు చేస్తే బోనస్‌గా రూ.100 ఇస్తానని అగ్రిమెంట్ చేశాడు. ఇందుకు నీకు ఇష్టమైతే సంతకం చేయాలని బాలుడికి సూచించాడు. రూ. 100 కోసం ఆ బుడ్డోడు.. అగ్రిమెంట్‌పై సంతకం పెట్టేశాడు కూడా. అప్పుడా తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ఆ అగ్రిమెంట్ పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Read Also : Astrology News : మీ జాతకం ప్రకారం.. ఏ రాశుల వారు ఏ రంగు వాహనాలను వాడితే మంచిదో తెలుసా…