Indian Railways : రైల్లో ఈ 7 వస్తువులను పొరపాటున ఎప్పుడూ తీసుకెళ్లొద్దు.. లేదంటే జరిమానా, జైలుశిక్ష తప్పదు..!

Indian Railways : రైల్లో ప్రయాణించే వారికి అలర్ట్.. రైలు ప్రయాణాల్లో రైల్వే నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది ప్రయాణీకులు తెలియకుండానే నిషేధిత వస్తువులను తీసుకెళ్తారు. వీటితో పట్టుబడితే జరిమానాలు లేదా జైలు శిక్ష విధించవచ్చు.

Updated on: August 18, 2025

Indian Railways : రైల్లో ప్రయాణించే వారికి అలర్ట్.. రైలు ప్రయాణాల్లో రైల్వే నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది ప్రయాణీకులు తెలియకుండానే నిషేధిత వస్తువులను తీసుకెళ్తారు. వీటితో పట్టుబడితే జరిమానాలు లేదా జైలు శిక్ష విధించవచ్చు.

Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్లో ప్రయాణించే సమయంలో కొన్ని వస్తువులను అసలు తీసుకెళ్ల కూడదు. అలా చేస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలు ప్రతిరోజూ సుమారు 13వేల రైళ్లను నడుపుతున్నాయి. రైలు ప్రయాణం సౌకర్యవంతంగానూ ఎంతో సురక్షితంగా ఉంటుంది. అలాంటి రైలు ప్రయాణాల్లో సామాన్యుల బడ్జెట్ ప్రకారం సౌకర్యవంతంగా ఉంటుంది.

దేశంలోని ప్రతి మూలకు చేరుకునేందుకు ప్రజలు రైల్వేలపై ఆధారపడుతుంటారు. కానీ, రైలు ప్రయాణాల్లో సౌకర్యంతో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రయాణీకులకు స్వేచ్ఛతో పాటు రైల్వే నియమాలను కూడా పాటించాలి.

Advertisement

చాలా సార్లు ప్రయాణీకులు ఆలోచించకుండా ఏదైనా లగేజీని ప్యాక్ చేస్తారు. అయితే, రైలులో తీసుకెళ్లేందుకు కచ్చితంగా నిషేధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఒక ప్రయాణీకుడు ఇలాంటి నిషేధిత వస్తువులతో పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Indian Railways : రైల్లో ఈ నిబంధనలు ఎందుకంటే? :

రైల్వేల ప్రధాన లక్ష్యం ప్రయాణీకుల భద్రత, సౌలభ్యం. కొన్ని వస్తువులు అగ్ని ప్రమాదం, ప్రమాదం లేదా ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం.. ఈ వస్తువులను తీసుకెళ్లినవారికి రూ. 1000 వరకు జరిమానా, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారు.

రైల్లో ప్రయాణించే సమయంలో ఏయే వస్తువులను తీసుకెళ్లడం నిషేధమంటే? :

ఎండు కొబ్బరి :
ఎండు కొబ్బరి పెంకు చాలా మండే స్వభావం కలిగి ఉంటుంది. అగ్ని ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, రైలులో ఎండు కొబ్బరిని తీసుకెళ్లడం నిషేధం.

Advertisement

Read Also : Dog Bark : కుక్కలు కొంతమంది మీద మాత్రమే ఎందుకు మొరుగుతాయి? కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

గ్యాస్ సిలిండర్
సిలిండర్ కదలిక వలన లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. తద్వారా రైల్లో మంటలు చెలరేగవచ్చు.

బాణసంచా, గన్‌పౌడర్ :
ఈ వస్తువులు చాలా తేలికగా మంటలు అంటుకుంటాయి. కాబట్టి వీటిని రైలులో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం.

Advertisement

యాసిడ్, కెమికల్స్ :
హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనర్లు లేదా ఇతర ప్రమాదకర రసాయనాలను రైలులో తీసుకెళ్లకూడదు. ఎందుకంటే చర్మాన్ని కాల్చేస్తాయి లేదా ఊపిరాడకుండా చేస్తాయి.

Indian Railways : పెట్రోల్ , డీజిల్ , కిరోసిన్, నూనె :

ఇవన్నీ అత్యంత మండే పదార్థాలు. రైలులో ఈ వస్తువులను తీసుకెళ్ళినప్పుడు అగ్ని ప్రమాదానికి దారితీస్తాయి.

Indian Railways
Indian Railways

అగ్గిపుల్లలు, స్టవ్ :
అగ్గిపుల్లలు, స్టవ్‌ల నుంచి మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని తీసుకెళ్లడం నిషేధం.

Advertisement

దుర్వాసన లేదా కుళ్ళిన వస్తువులు :

చెడిపోయిన ఆహారం, తోలు, ఎండిన గడ్డి లేదా ఏదైనా దుర్వాసన వచ్చే వస్తువును రైలులో తీసుకెళ్లడం వల్ల ప్రయాణీకులకు సమస్యలు తలెత్తుతాయి.

నెయ్యి :
రైల్వే నిబంధనల ప్రకారం.. 20 కిలోల వరకు నెయ్యిని తీసుకెళ్లవచ్చు. కానీ, అది గట్టిగా మూత పెట్టి ఉండాలి లేదా చిందకుండా ఉండేలా టిన్ డబ్బాలో సరిగ్గా ప్యాక్ చేయాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel