Karthika Deepam : కార్తీక్ కోసం మోనిత ఆరాటం.. కూతురి ప్రాణాలు కాపాడుకున్న డాక్టర్ కార్తీక్.. సంతోషంలో దీప!

Karthika Deepam Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేయడం మా వల్ల కాదని.. డాక్టర్ కార్తీక్ మాత్రమే ఈ ఆపరేషన్ చేస్తాడని అనడంతో దీప ఎలాగైనా నేను డాక్టర్ కార్తీక్ గారిని పిలిపిస్తానని అంటుంది. దాంతో ఆ డాక్టర్స్ ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతారు. ఇక దీప బయటకు వచ్చి కార్తీక్ ను ఆపరేషన్ చేయమని బతిమాలుతోంది.

Karthika Deepam Feb3 Episode Today
Karthika Deepam Feb3 Episode Today

మరోవైపు మోనిత కోటేష్ ఫోటో చూస్తూ కోపంతో రగిలిపోతుంది. పక్కనే ఉన్న కార్తీక్ ఫోటో చూసి కార్తీక్ ను తలుచుకుంటుంది. తొందరపడి ఆదిత్య వాళ్లతో శపథం చేశానా అని అనుకుంటుంది. అయినా సరే ఎలాగైనా కార్తీక్ ను వెతుకుతాను అని ఫిక్స్ అవుతుంది. అప్పుడే డాక్టర్ భారతి రావడంతో తనతో కార్తీక్ గురించి మాట్లాడుతుంది. ఇక భారతి తాను ఊరు వెళ్తున్నానని చెప్పి మోనితను కూడా ఆహ్వానిస్తుంది.

ఇక మోనిత అక్కడ కార్తీక్ దొరుకుతాడేమో అని ఆలోచిస్తుంది. రుద్రాణి కూడా కార్తీక్, దీప గురించి ఆలోచిస్తుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇప్పటికైనా వాళ్ళని వదిలేది లేదని హిమను తన సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక తన మనుషులను దీప వాళ్ల కోసం వెతకడానికి పంపించడంతో వాళ్ళు వెతికే పనిలో ఉంటారు.

Advertisement

Karthika Deepam : కార్తీక్ కోసం మోనిత ఆరాటం.. 

అదే సమయంలో వాళ్ళకి ఫోన్ చేయటంతో వాళ్లు ఫోన్ లేపడానికి కాసేపు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెతకమని చెబుతుంది. ఇక కార్తీక్ ఎలాగైనా తన కూతురికి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ గా మారుతాడు. మరోవైపు ఆపరేషన్ థియేటర్ బయట దీప, సౌర్య ఏడుస్తూ ఉంటారు. అప్పుడే కార్తీక్ డాక్టర్ కార్తీక్ గా ఆపరేషన్ థియేటర్ లోకి వెళతాడు.

కానీ అక్కడ ఉన్న దీప కార్తీక్ ను చూడలేకపోతుంది. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కార్తీక్ తాను డాక్టర్ కార్తీక్ అని చెప్పడంతో ఆ డాక్టర్ షాక్ అవుతాడు. వెంటనే డాక్టర్ అంజలి ని పిలిపించడం తో ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. మొత్తానికి ఆపరేషన్ చేసి కార్తీక్ బయటకు వస్తాడు. ఇక దీప కార్తీక్ ను చూస్తూ దండం పెడుతుంది. కార్తీక్ ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు చెయ్యి ద్వారా చూపించడంతో దీప సంతోషపడుతుంది. డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని మీ భర్త ఎక్కడ అని దీపను అడుగుతారు.

Read Also : Karthika Deepam : కార్తీకదీపంలో హైలెట్ సీన్.. రంగంలోకి దిగిన డాక్టర్ కార్తీక్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel