...

Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బయటకి కనిపించకపోయినా కూడా మన కళ్ళ ద్వారా ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో మన కళ్ళల్లో కనిపించే కొన్ని లక్షణాల వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందని గుర్తించవచ్చు. అధిక కొలెస్ట్రాల్ వల్ల కంటిచూపు సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.

మన కళ్ళను బట్టి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక బరువు, హై బీపీ, డయాబెటిస్ ఉన్న వారిలో కళ్లు లేదా ముక్కు చుట్టూ చదునుగా లేదా ఉబ్బెత్తుగా ఉన్నట్టు పసుపు రంగులోకి మారడం మనం గమనించవచ్చు. అధిక కొవ్వు వలన కనిపించే లక్షణాలలో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా కొందరిలో కళ్లలోని కార్నియా చుట్టూ తెల్లని రింగ్ లా ఏర్పడుతుంది. దీనిని కార్నియల్ ఆర్కస్ అని పిలుస్తారు. సాధారణంగా లక్షణం వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. యువకులలో కూడా ఈ లక్షణం కనిపిస్తే అందుకు కారణం అధిక కొలెస్ట్రాల్ అని మనం గమనించవచ్చు.

Health Tips:

అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కళ్ళు వాపు రావటం కళ్ళల్లో నొప్పి కలగటం కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు ముఖ్య కారణం కూడా అధిక కొలెస్ట్రాల్. కన్ను వెనుక భాగంలో ఉండే రెటీనా పొర కి సిరలు ధమనుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు ధమనులు సిరలకు కొలెస్ట్రాల్ అడ్డుపడి అవి మూసుకుపోతాయి. ఇలా జరగటం వల్ల రక్తం ఇంకా ఇతర ద్రవాలు రెటీనా పొరలోకి లీక్ అవడం మొదలవుతుంది. రెటీనా పొరలోకి రక్తం లీక్ అవ్వటం వల్ల కళ్ళు నొప్పి పెట్టడం కంటి చూపు మందగించటం కళ్ళల్లో నీరు కారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయిందని గుర్తించి శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.