Health tips: వాతావరణ మార్పులు, ప్రస్తుత జీవన శైలి కారణంగానే అనేక మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివి కదా అని చాలా మంది క్యారెట్, బీట్ రూట్, క్యాలీ ఫ్లవర్ లను అధికంగా తినేస్తున్నారు. కానీ వాటిని అతిగా తినడం కూడా మంచిది కాదని ఆరోగ్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూరే అయినప్పటికీ అది అందరికీ పడదదు. ముఖ్యంగా దీని వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అయితే క్యాలీఫ్లవర్ ను పచ్చిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పుట్ట గొడుగులను కూడా అతిగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అలెర్జీ సమస్యలు వస్తాయి. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీస్కోవడం మంచిది.
క్యారెట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. వీటిని తినే ముందు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. అలాగే బీట్ రూట్ ను సలాడ్ లలో ఎక్కువగా వాడుతుంటారు. సరైన మోతాదులో తీస్కుంటే ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తుందో.. అతిగా తీస్కుంటే అన్ని సమస్యలను కల్గిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే చాలా మంచిది.