Karthika Deepam Today Episode Jan 28 : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక కార్తీక్ దంపతులు ఇద్దరూ కలిసి రుద్రాణి అప్పు తీరిస్తే తప్ప మనకు ఎటువంటి ముందడుగు వెయ్యలేమని అనుకుంటూ ఉంటారు. అదే క్రమంలో సౌందర్య, ఆనంద్ రావు గురించి ఆలోచించుకొని బాధ పడతారు.
ఆ తర్వాత స్కూల్ లేకపోవడంతో సౌర్య వాళ్ళు ఇంటిలో స్కిప్పింగ్ ఆడడానికి ప్లాన్ చేస్తారు. అలా స్కిప్పింగ్ ఆడుతూ ఉన్న సౌర్య ఒక్కసారిగా నేలకూలి పోతుంది. ఆ తర్వాత సౌర్య ను క్లినిక్ లో చూపించడానికి ఇంట్లో డబ్బులు తక్కువగా ఉంటాయి. కార్తీక్ చేతిలో వైద్యానికి డబ్బు లేకపోవడంతో వాళ్ల మమ్మీ ను డబ్బులు అడగడానికి ఆశ్రమానికి సైకిల్ మీద బయలుదేరుతాడు.

Karthika Deepam Today Episode Jan 28 : కార్తీకదీపం సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ బాబు ఏం చేస్తాడో..?
అలా సైకిల్ మీద వెళుతూ కార్తీక్ “నువ్వు దేవుడివా..శాడిస్ట్ వా.. నా బిడ్డను కాపాడు” అని గట్టిగా అరుచుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్తాడు. అలా వచ్చిన కార్తీక్, అమ్మా నాన్న నన్ను తిట్టినా పరవాలేదు. ఎలాగైనా వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని సౌర్యకు వైద్యం చేయించాలని అనుకుంటాడు. కానీ ఆశ్రమంలో వ్యక్తి కార్తీక్ కు వాళ్ళు వెళ్లిపోయారని.. వాళ్ల గురించి చెప్పనని అంటాడు.
అలా వైద్యానికి డబ్బులు లేక తిరుగుతున్న కార్తీక్ కు రుద్రాణి మనుషులు అడ్డుపడతారు. ‘అక్క నిన్ను తీసుకు రమ్మందని బెదిరిస్తారు’. కార్తీక్ జరిగిన విషయం ఎంత చెప్పినా వినిపించుకోకుండా కార్తీక్ ను బలవంతంగా రుద్రాణి దగ్గరికి తీసుకు వెళతారు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
Read Also : Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!
- Karthika Deepam: సౌందర్య చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న స్వప్న..సంతోషంలో నిరూపమ్..?
- Karthika Deepam: నిశ్చితార్థం జరుగుతుండగా పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇచ్చిన హిమ.. ఇదంతా జ్వాల కోసమేనా!
- Karthika Deepam Sep 7 Today Episode : మోనితను రోడ్డుపై వదిలేసిన కార్తీక్.. డాక్టర్ బాబుకి తల మసాజ్ చేస్తున్న వంటలక్క..?














