Karthika Deepam: నిశ్చితార్థం జరుగుతుండగా పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇచ్చిన హిమ.. ఇదంతా జ్వాల కోసమేనా!

Updated on: May 11, 2022

Karthika Deepam: తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్వాల నన్ను ఆ దిక్కుమాలిన వాడి కారులో పంపావు అంటూ తన బాబాయ్ పై చిరాకు పడుతుంది. ఆ తర్వాత హడావిడిగా ఫంక్షన్ కి వస్తుంది. కానీ అక్కడ ఫంక్షన్ లో ఎవరూ ఉండరు. మరోవైపు నిరూపమ్ నువ్వంటే చాలా ఇష్టం అని హిమతో అంటాడు. ఇక హిమ కూడా నువ్వంటే నాక్కూడా ఇష్టమే బావ.. అత్తయ్య కి భయపడి చెప్పలేదు అని అంటుంది.

Advertisement

ఇక ఈ క్రమంలో నిరూపమ్ హిమలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని దగ్గరికి వస్తారు. అంతేకాకుండా అమ్మమ్మ పుణ్యమా అంటూ.. ఇద్దరం ఒకటవ్వ బోతున్నాం అని అనుకుంటారు. ఇక హిమ సౌర్య గురించి బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడకు సౌందర్య వచ్చి సౌర్య వచ్చాకే నువ్వు పెళ్లి చేసుకుంటావు అని హిమకు ధైర్యం చెబుతుంది. దాంతో హిమ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది

మరోవైపు సత్య స్వప్న.. పెళ్లిను ఒప్పుకున్నందుకు గాను.. నిరూపమ్, హిమ లు ఇద్దరు ఒకటి అవుతున్నందుకు కు మందు తాగుతూ చిల్ అవుతాడు. ఇక ప్రేమ్ అక్కడికి వచ్చి తన బాధను మరిచిపోవడానికి తనకు ఒక పెగ్ పొయ్యి మని అడుగుతాడు. దానికి సత్య ఆశ్చర్యపోయి ఒక పెగ్ పోయగా ప్రేమ్ తాగి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ్ ఏం చేయాలో అర్థం కాక అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

మరోవైపు స్వప్న సౌందర్య చెప్పకుండా పెళ్లి నిర్ణయం తీసుకున్నందుకు ఇంట్లో వస్తువులు అన్నీ కోపంతో విసిరేస్తూ ఉంటుంది. ఇక ఈ లోపు సౌందర్య అక్కడికి వచ్చి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ స్వప్న హిమ విషయంలో పెళ్లి అసలు అంగీకరించదు. ఇక స్వప్న కార్తీక్ దీపలను పొట్టనపెట్టుకుంది దాన్ని చూడ్డానికి నాకు కంపరంగా ఉందని హిమను అంటుంది.

Advertisement

ఇక ఫైనల్ గా సౌందర్య నువ్వు వచ్చినా రాకపోయినా ఈ నిశ్చితార్థం ఆగదు అన్నట్లు చెబుతుంది. మరోవైపు జ్వాల నిరూపమ్ ఫోటోని చూసుకుంటూ.. మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు జ్వాల దగ్గరకు హిమ వచ్చి నిన్ను డాక్టర్ సాబ్ రమ్మంటున్నారు అని చెబుతుంది. దాంతో జ్వాల ఎక్కడ లేని ఆనందం తో ఆటో ని స్టార్ట్ చేస్తుంది.

ఇక తరువాయి భాగం లో నిరూపమ్ హిమల నిశ్చితార్థం సౌందర్య గుడిలో జరిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అదే గుడికి జ్వాల వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక జ్వాల ను గమనించిన హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ.. నిశ్చితార్థం మధ్యలోనే లేచి వెళ్లి పోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel