...
Telugu NewsEntertainmentAlia Bhatt RRR : ఆలియా భట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కనిపించేది ఎంత సమయమో తెలుసా?

Alia Bhatt RRR : ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కనిపించేది ఎంత సమయమో తెలుసా?

Alia Bhatt RRR : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు కనిపించబోతున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ మరియు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో ఇద్దరి స్క్రీన్ స్పేస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా సింగిల్ స్టార్ హీరో మూవీ అయితే మొత్తం సినిమా అంతా ఆ హీరోనే కనిపిస్తారు. హీరోయిన్ కొద్దిపాటి సన్నివేశాల్లో పాటల్లో మాత్రమే కనిపిస్తుంది.

Advertisement

అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల సినిమా అవడంతో హీరోయిన్ కి ఏమాత్రం పాత్ర ఉంటుంది.. ఆమె స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా లో ఆలియా భట్ పాత్ర కథకు అత్యంత కీలకమైనదిగా చిత్ర రచయిత కమ్ జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ తెలియజేశాడు. సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా కచ్చితంగా ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదని ఆయన బల్లగుద్ది మరీ చెప్పాడు. దాంతో సినిమాలో ఆమె స్క్రీన్ కొద్ది సమయమే అని ముందే క్లారిటీ వచ్చేసింది.

Advertisement
Alia Bhatt RRR _ Alia Bhatt will be seen for not more than 15 minutes in RRR movie
Alia Bhatt RRR _ Alia Bhatt will be seen for not more than 15 minutes in RRR movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లో 50 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆలియా భట్ ఆర్ ఆర్‌ ఆర్ సినిమా లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల గంగూ భాయ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియాభట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్లో ఈ అమ్మడి కారణంగా ఒకింత ఎక్కువ బిజినెస్ చేసింది అని నాకు అనిపిస్తుంది. కనుక ఈమె కోసం ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ల వద్ద క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి మరియు ఆమె అభిమానులను ఏ మేరకు సంతృప్తి అనేది చూడాలి.

Advertisement

Read Also : RRR Promotions : ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌‌తో బోర్ కొట్టిస్తున్న జక్కన్న..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు