...

Beauty tips for face : రావి ఆకులతో సౌందర్యం.. ముఖం మీద మచ్చలన్ని పోయి ఇంత అందంగా తయారవుతుందా..?

Beauty tips for face : ప్రతి ఒక్క అమ్మాయి ఎంత అందంగా కనిపించినప్పటికీ ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలు కారణంగా ముఖం కూడా చెడిపోతుంది.. నల్లటి మచ్చలును,మొటిమలను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసుగు చెందుతుంటారు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆకుతో మరింత అందాన్ని పెంపొందించుకోవడంతో పాటు ముఖం మీద వచ్చే మొటిమలు..మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా దూరమవుతాయి.

ఇకపోతే ఏ ఆకులను ఉపయోగించి మాచ్చలు దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఆకులు ఏవో కాదు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రావి చెట్టు యొక్క ఆకులు. రావిచెట్టు ఎంతో పవిత్రమైనదని కేవలం దైవంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుందని ప్రజలు విశ్వసిస్తారు.ఇప్పుడు తాజాగా వెల్లడైన విషయం ఏమిటంటే ఈ రావి ఆకులు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా సహాయపడతాయని వెల్లడైంది. ఈ ఆకులను ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం..

with-this-leaf-all-the-scars-on-the-face-can-be-removed-and-made-so-beautiful-in-telugu
with-this-leaf-all-the-scars-on-the-face-can-be-removed-and-made-so-beautiful-in-telugu

నాలుగు, ఐదు రావి ఆకులు తీసుకొని, నీటిలో శుభ్రంగా కడిగి,మిక్సీలో వేసి,కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్టులా చేయాలి.ఈ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ఈవెన్ గా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ముఖాన్ని బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, కాటన్ టవల్ తో మాత్రమే తుడుచుకోవాలి.. ఈ పద్ధతిని ప్రతిరోజు పాటించడం వల్ల కేవలం 3 రోజుల్లో మీ ముఖం మీద ఉండే మచ్చలు తగ్గుముఖం పడుతాయి. రావి ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అంతేకాదు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ ఆకులను ఉపయోగించవచ్చు.

Read Also : Grey Hair Problems Solution : ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్యలే ఉండవు..