Grey Hair Problems Solution : యుక్తవయసులోనే కొందరిని తెల్లజుట్టు సమస్యలు వేధిస్తాయి. ఆడ వారికైనా, మగవారికైనా ఈ సమస్యతో పదిమందిలోకి వెళితే చిన్నతనంగా ఉంటుంది. దానివల్ల మానసికంగా వారు కృంగిపోతారు. అయితే దీనికో చక్కటి పరిష్కారం ఉంది. కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లజుట్టు సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. అక్కడక్కడా కనిపిస్తున్న తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

grey-hair-problems-solution-how-to-change-grey-hair-in-to-black-hair-in-telugu
ఒక బౌల్ లో ఉసిరికాయ పౌడర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బూడిదగా మారేవరకూ వేడిచేయాలి. ఆ తర్వాత అందులో అరలీటర్ కొబ్బరినూనె వేసి దాదాపు 20 నిమిషాల పాటు ఉంచాలి. దాన్ని స్టవ్ మీంచి దింపి పక్కన పెట్టుకోవాలి. మర్నాడు జాలీతో వడగట్టి ఒక సీసాలో పొయ్యాలి. ఈ నూనెను వారంలో రెండు రోజులు తలకి పట్టింటి మసాజ్ చేసుకోవాలి.
కాస్త కరివేపాకు, రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి, రెండు టీ స్పూన్ల బ్రాహ్మీ పౌడర్ ను మిక్సీలో వేసి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్ లా పట్టించాలి. ఓ గంట తర్వాత హెర్బల్ షాంపూతో కడిగేసుకోవాలి. తెల్లజుట్టు నివారణకు బ్లాక్ టీ కూడా అద్భుతంగా పని చేస్తుంది. బ్లాక్ టీ ఆకుల్ని గోరువెచ్చటి నీటిలో నానబెట్టి, తర్వాత మెత్తటి పేస్ట్ లా చేసి కొద్దిగా నిమ్మరసం వేసి జుట్టుకు మాస్క్ లా పట్టించాలి. నలభై నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. క్రమంగా ఇలా చేస్తే తెల్లజుట్టు మన దరికి చేరదు.
Read Also : kerala culture : సంధ్యాదీపం ఎందుకు వెలిగిస్తారు?