Hair Growth Tips : మనకు ఏమాత్రం అలసటగా అనిపించినా ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగుతాం. చిటికెలో ఉపశమనం పొందుతాం. తలనొప్పిని తగ్గించడంలో కూడా కాఫీ పాత్ర చాలానే ఉంటుంది. చదువుకునే పిల్లలకు నిద్ర రాకుండా ఉండేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కాపీని ఇస్తుంటాం. అయితే వీటికి మాత్రమే కాదండోయ్ కాఫీ వల్ల మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గరుకు జుట్టును కూడా సిల్కీగా మార్చగలిగే లక్షణం కాఫీకి ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇది చాలా బాగా సాయపడుతుంది. కాఫీతో తయారు చేసిన హెయిర్ మాస్క్ మాడును శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు మూలాల నుంచి బలంగా చేకూరి ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఒక గుడ్డు సొనలో 3 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేస్కోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన హెయిర్ మాస్కును వెంట్రుకల మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి.
ఈ విధంగా జుట్టు మొత్తాన్ని హెయిర్ మాస్కుతో నింపాలి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు వేళ్లతో స్కాల్ప్ ను సున్నితంగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడికి సమాన పరిమాణంలో తేనెను వేస్కొని, బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు రూట్ నుండి చివరి వరకు పూసుకోవాలి. 40 నిమిషాల తర్వాత తలస్నానం చేస్కోవాలి.
Read Also : Water Spinach Uses : ఈ ఆకును తిన్నారంటే.. వందేళ్లు వచ్చినా కంటిచూపు తగ్గదు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!