Water Spinach Uses : కంటిసమస్యలతో బాధపడుతున్నారా? జీవితంలో కంటి సమస్యలు అసలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ఆకును తినాల్సిందే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ ఆకు ఏంటో తెలుసా? తూటి కూర ఆకు.. దీన్ని ఆంగ్లంలో (Water Spinach) అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ తూటి కూర ఆకు మొక్కులు ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
చూడటానికి ఏదో పిచ్చి మొక్కలా కనిపించే ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఆకు మొక్కలు కనిపిస్తుంటాయి. దీన్ని కలుపు మొక్క భావిస్తుంటారు. వాస్తవానికి ఈ మొక్కను కూరలా వండుకుంటారని చాలామందికి తెలియకపోవచ్చు. అంతేకాదు.. పచ్చడిగా కూడా చేసుకుని తింటుంటారు. ఈ ఆకు పచ్చని ఆకు ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ తూటి కూర ఆకును ఇంతకీ ఎలా వాడాలి.. ఎలాంటి జబ్బులకు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తూటి కూర ఆకును కూరగానీ లేదా పచ్చడిలాగా కానీ తయారుచేసుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో పుష్కలమైన ఐరన్ అధికంగా దొరకుతుంది. చాలామంది గడ్డలు, చెగ గడ్డలు, వ్రణాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ మొక్క ఆకు అద్భుతమైన రెమడీగా పనిచేస్తుంది. ఇలాంటి వ్రణాలను తగ్గించేందుకు ఈ తూటి ఆకు కూర అద్భుతంగా పనిచేస్తుంది.
Water Spinach Uses : తూటి కూర ఆకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తూటి కూర ఆకును తీసుకొచ్చి దానిపై ఆముదాన్ని రాయాలి. నిప్పుల సెగపై లైటుగా వేడి చేయాలి. ఈ వ్రణాలపై పెట్టి కట్టు కట్టాలి. రెండు రోజులు అలానే పెట్టి ఉంచాలి. కొద్ది రోజుల్లోనే వ్రణాల సమస్యలు వెంటనే నయమైపోతాయి. ఇక కంటి సమస్యలతో బాధపడేవారికి ఈ తూటి కూర ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.
కంటిచూపు తగ్గినా లేదా కంటిచూపు మందగించినా లేదా కంట్లో నుంచి నీళ్లు కారుతున్నా వెంటనే ఈ తూటి కూర ఆకును తీసుకుని కూరలాగా చేసి వారికి తినిపించాలి. ఇలా తరచూ తినడం ద్వారా తొందరలోనే కంటిచూపు సమస్యలు తొలగిపోతాయి. ఎక్కువగా ఈ తూటి కూర ఆకును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.
షుగర్ సమస్యతో బాధపడేవారు ఈ తూటి కూర ఆకును తినడం ద్వారా వెంటనే షుగర్ కంట్రోల్ అవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తూటి కూర ఆకులను తినడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను వెంటనే తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ ఊళ్లో తూటి కూర ఆకు కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చిపెట్టుకుని తరచూ ఆహారంలో తీసుకోండి. ఎలాంటి అనారోగ్య సమస్యలైన తొలిగిపోతాయి.
Read Also : Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?