Black Hair: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు జుట్టు తెల్లబడుతుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్లాలన్నా నిత్యం బ్లాక్ డై వేసుకుంటూ ఎంతో సతమతమవుతున్నారు. ఇక మరికొందరికీ ఇలాంటి బ్లాక్ హెన్నాలు సరిపడక అధికంగా జుట్టు రాలిపోతున్న సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
ఇలా ప్రతిసారీ జుట్టుకు రంగు వేసుకోవడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవడమే కాకుండా అధికంగా జుట్టురాలే సమస్య ఉండటంతో చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాను పాటిస్తే చాలు తక్కువ ఖర్చుతో తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. మరి ఆ చిట్కా ఏంటి అనే విషయానికి వస్తే… ముందుగా ఒకటిన్నర లీటర్ నీటిని తీసుకుని ఒక గిన్నెలో బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలోకి
అర కప్పు ఎండు ఉసిరి ముక్కలను, 4 కుంకుడు కాయలను, అర కప్పు షీకా కాయలను వేసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి.
తరువాత ఈ నీటిని 45 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీరు చల్లబడిన తర్వాత ఆ నీటిలో ఉన్నటువంటి ఉసిరి ముక్కలు, కుంకుడు కాయ పిప్పిని తొలగించి అందులోకి సహజ సిద్ధంగా దొరికే ఒక కప్ హెన్నా పౌడర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత ఈ హెన్నా మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి కొనవరకు బాగా అంటించి రెండు గంటల తర్వాత షాంపు లేకుండా తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా దోహదపడుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World