Banana Black Spots : అరటి పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు వాటిలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ఇక వాటి పై ఏర్పడిన నల్లటి మచ్చలు గురించి తెలియక చాలామంది వాటిని తీసుకోకుండా ఉంటారు. అవి తింటే ప్రమాదమని నమ్ముతుంటారు. కానీ ఆ నల్లటి మచ్చలు వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు తిన్న ఆహారం జీర్ణం అవ్వడంలో ఎంతగానో సహాయపడతాయి. సహజ పోషకాలను సత్వరం అందిస్తాయి. అయితే అరటి పండ్ల పై ఏర్పడిన నల్లటి మచ్చలు చాలా మంది కుళ్ళినవి అని భావిస్తుంటారు. అలా అనుకుంటే పొరపాటే ఇప్పుడే గోధుమ రంగు, నలుపు రంగు మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Banana Black Spots : నల్లటి మచ్చలున్న అరటిపళ్లను తింటున్నారా?
నల్ల మచ్చలు టి ఎన్ ఎఫ్ ట్యూమర్ నీక్రోసిష్ ఫ్యాక్టర్ ని సూచిస్తాయి. ఇది ఒక క్యాన్సర్ పోరాట పదార్థం. ఇది శరీరంలోని అసాధారణ కణాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ నల్లటి మచ్చలు కలిగిన అరటిపండు తినడం వల్ల క్యాన్సర్ బారినుండి తగ్గించుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
అరటి పండ్లు గుండెకు బాగా మేలు చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో తోడ్పడతాయి. అరటి పండ్లలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం లేకుండా చేస్తుంది. ప్రేగుల్లో కదలికను బాగా ఉంచుతుంది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయపడుతుంది. ఇక అరటి పండు పండే కొద్ది వాటిలో మెగ్నీషియం లెవెల్స్ పెరుగుతాయి. మెగ్నీషియం లెవెల్స్ పెరగడం వల్ల శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటును తగ్గిస్తుంద మెగ్నీషియం లెవెల్స్ పెరగడం వల్ల శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు ఈ అరటి పండ్లు తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది.
Read Also : Health: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే ఇది అదే కావచ్చు వెంటనే అలర్ట్ అవ్వండి?