Ayurveda-Lasora Fruits: మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రకృతిలో లభించే అనేక మొక్కలు చెట్లనుండి లభించే ఆకులు,పువ్వులు, చెట్ల బెరడు ద్వారా ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. అలాంటి ఔషధాలు కలిగిన మొక్కలలో విరిగి చెట్టు కూడా ఒకటి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దీనిని పిలుస్తూ ఉంటారు. వీటి కాయల లోపల బంక గా ఉండటంవల్ల దీనిని బంక కాయలు చెట్టు అని కూడా అంటారు. ఈ పరిగి చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ పరిగి చెట్టు కాయలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. చూడటానికి లేత ఎరుపు రంగులో చిన్న సైజులో ఉండే ఈ కాయలు రుచికి తియ్యగా, వగరుగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ చెట్టు కాయలు తినటం వల్ల వారి సమస్య దూరమవుతుంది. పరిగి కాయలు షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ప్రతిరోజు ఐదారు కాయలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. ఈ పండ్లు తినటం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరిగి సంతానలేమి సమస్యలు దూరమవుతాయి.
ఈ చెట్టు యొక్క బెరడు కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు ఉపయోగించి అనేక చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయవచ్చు. ఈ చెట్టు బెరడుతో కషాయం చేసుకుని తాగితే వల్ల మహిళల్లో నెలసరి సమస్యలతో బాధపడే వారు కూడా ఉపశమనం పొందవచ్చు.ఈ చెట్టు యొక్క బెరడు తో కషాయం చేసి గాయం అయిన ప్రదేశంలో ఈ కషాయంతో గాయాన్ని శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లు వేసవికాలంలో మాత్రమే లభిస్తాయి. అందువల్ల వీటిని సేకరించి ఎండబెట్టి కొన్ని చోట్ల చేసుకొని నిల్వ చేయవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World