Health Tips : గచ్చకాయ సాధారణంగా చాలామంది ఈ పేరు కూడా విని ఉండరు. మన భారతదేశంలో అటవీ ప్రాంతంలో విరివిగా కనిపించే ఈ గచ్చకాయ గురించి మన పూర్వీకులను బాగా తెలుసు. అడవుల్లో పెరిగే ఈ గచ్చకాయ చెట్టు తీగల మాదిరిగా వేరే చెట్లకు అల్లుకొని ఉంటుంది. గచ్చకాయల తో పూర్వం పిల్లలు ఆటలు ఆడే వారు. ఈ గచ్చకాయ చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గచ్చకాయ చెట్టు ఆకుల వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గచ్చకాయ చెట్టు తీగలు, ఆకులు, బెరడు వాటి కాయలు అన్ని ఆయుర్వేదంలో వైద్యానికి విరివిగా ఉపయోగిస్తారు.గచ్చకాయ చెట్టు ఆకుల లో పెరడులో కాయలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. గచ్చకాయ చెట్టు ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఫైల్ సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా నూరి ఆ ప్రదేశంలో రాయటం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళవాపు వంటి సమస్యలతో బాధపడేవారు గచ్చకాయ ఆకులను ఆముదం లో వేయించి నొప్పి ఉన్న చోట కట్టు కట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
గచ్చకాయ చెట్టు పూసే పూలు షుగర్ వ్యాధితో బాధపడేవారికి వ్యాధి నివారణలో ఎంతో ఉపయోగపడతాయి.గచ్చకాయ చెట్టు పూల రసం ప్రతి రోజు తాగడం వల్ల షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఈ పూల రసం తాగడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు కూడా నివారించవచ్చు.
గచ్చకాయ లోపల ఉండే నల్లని విత్తనాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మూత్ర సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, షుగర్ వ్యాధి నియంత్రణలో ఈ గచ్చకాయ గింజలు ఎంతో ఉపయోగపడతాయి.
Read Also : Bussiness idea : రెండెకరాల భూమి ఉంటే చాలు.. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి కోటీశ్వరులు అవ్వొచ్చు!
Tufan9 Telugu News And Updates Breaking News All over World