Health Tips: సాధారణంగా మన ఇంట్లో ఉండే పోపుదినుసులు మిరియాల కూడా కచ్చితంగా ఉంటాయి. నల్ల మిరియాల గురించి వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నల్ల మిరియాల లోని ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. కడి తెల్ల మిరియాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. తెల్ల మిరియాల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. తెల్ల మిరియాల లోని ఔషధ గుణాలు అనేక వ్యాధులు రాకుండా మనల్ని కాపాడతాయి. తెల్ల మిరియాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల మిరియాలలో పైపెరిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమ్యూటాజెనిక్ మరియు యాంటిట్యూమర్ ప్రభావం ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. తెల్ల మిరియాలలో సుగంధ తైలం, ఒలియోరిసిన్ , ఆల్కలాయిడ్స్‌తో పాటు పైపెరిన్ అనే మూలకాలు అధికంగా ఉంటాయి. తెల్ల మిరియాల లో ఉండే పైపెరిన్ అనే మూలకం అధిక బరువు సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తెల్ల మిరియాలు తినటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువును నియంత్రణలో ఉండేలా చేస్తాయి.
క్యాన్సర్ నివారణలో కూడా తెల్ల మిరియాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెల్ల మిరియాల లో ఉండే కార్సినోజెన్ అనే పదార్థం శరీరంలో కేన్సర్ కణతులను నివారిస్తుంది.క్యాన్సర్ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు వారు తీసుకొనే ఆహారంతో మీడియాలో తినటం వల్ల క్యాన్సర్ సమస్యను అదుపులో ఉంచవచ్చు.
తెల్ల మిరియాలలో ఉండే అనాల్జేసిక్ మరియు యాంటీ కన్వల్సెంట్ తలనొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా తెల్ల మిరియాలు కంటిచూపును మెరుగు పరుస్తాయి. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా తెల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World