Bussiness idea : మనం దేశంలోని చాలా మంది ప్రజలు ఇప్పటికీ సంప్రదాయ పంటలు పండించేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. నష్టాలు వచ్చినా సరే వాటినే కొనసాగిస్తుంటారు. కానీ కొత్త పంటలు సాగు చేసేందుకు మాత్రం ఎక్కువ ధైర్యం చేయరు. ఇరవై ఎకరాల భూమి ఉన్న ఆసాముల కంటే కూడా రెండెకరాల భూమి ఉన్న వాళ్లు ఈ పంటను సాగు చేసి కోటీశ్వరులు అవ్వొచ్చు. అంత తక్కువ పొలంలో ఏ పంట పండించి కోటీశ్వరులు అవుతారు అనుకుంటున్నారా… డ్రాగన్ ప్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ ను పండించి నిజంగానే కోటీశ్వరులు అవ్వొచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ ను ఎక్కువగా మలేషియా, థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా మరియు వియత్నాంలో పండిస్తుంటారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా మన దేశీస్థులు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తొలి దశలో ఈ పండును సాగు చేసేందుకు ఎకరానికి నాలుగు లక్షల ఖర్చు అవుతుంది. ఒక సీజన్ లో మూడు సార్లు పండ్లనిచ్చే ఈ చెట్లు.. ఒక్కసారి 50 నుంచి 60 పండ్లను ఇస్తుంది. ఒక్కో పండు దాదాపు 400 గ్రాముల వరకు ఉంటుంది.
అయితే మన దేశంలో డ్రాగన్ ఫ్రూట్ కిలో ధరు రూ.200 నుంచి 250 వరకు ఉంటుంది. ఇలీ మీరు ఒక చెట్టు నుంచి కనీసం ఐదు వేలు సంపాదించొచ్చు. ఎకరం భూమిలో 1700 చెట్లు నాటి… సంవత్సరానికి 70 లక్షల రూపాయలను సులువుగా పొందొచ్చు. ఈ పంటను సాగు చేసేందుకు ఎక్కువ నీరు కూడా అవసరం లేనందున ఎవరైనా ఈజీగా పెంచేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ట్రై చేయండి.
Read Also : Bussiness ideas : రైతులను లక్షాధికారులను చేస్తున్న పంట.. ఏమిటో తెలుసా?