World Egg Day : గుడ్డులో చాలా పోషకాలు దాగి ఉంటాయి. అందుకే వైద్యులు రోజూ ఒక గుడ్డు తినాలని చెబుతుంటారు. మజిల్ పవర్ పెంచుకునేందుకు చాలా మంది గుడ్డు తింటారు. గుడ్డు సొన, తెల్లని భాగం ఇలా ఒక్కొక్కరూ ఒక్కోటి ఇష్టంగా తింటారు. కార్బొహైడ్రేట్లు, సంతృప్తి కొవ్వులు కావాలంటే పూర్తి గుడ్డు తినాలని చెబుతుంటారు వైద్యులు. జిమ్ లకు వెళ్లి వ్యాయామాలు చేసే వారు గుడ్డులోని సొన భాగాన్ని తినకుండా కేవలం తెల్లని భాగాన్ని మాత్రమే తింటారు. గుడ్డు మంచి పోషకాహారం కాబట్టే.. రోజూ ఎగ్ తినాలని నేషనల్ ఎగ్ కమిటీ అవగాహన కల్పిస్తుంది.

గుడ్డు వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే పచ్చి గుడ్డు తాగితే మంచిదా.. లేదా గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అయితే వైద్యులు మాత్రం పచ్చి గుడ్డును తాగడం కంటే కూడా ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. గుడ్డులోని తెల్లసొనలో ఎవిడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది.
ఇది బయోటిన్ తో కలిసి పోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా ఆపుతుంది. గుడ్డును వేడి చేస్తే అది బయోటిన్ నుండి విడిపోతుంది. అలాగే గుడ్డును ఉడకబెట్టినప్పుడు అందులోని పోషకాహార నిరోధకాలు తొలగిపోయి పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయి.
Read Also : Tamarind benefits: చింతపండు ఉపయోగాలు తెలిస్తే పుల్లగా ఉన్నా ఫుల్లుగా లాగించేస్తారు..!