...

Egg Health Tips : గుడ్డును అలా తినడం కన్నా ఇలా చేస్తే బెటర్ అని తెలుసా…!

Egg Health Tips : నిత్యం మనం తీసుకునే ఆహారంలో కోడి గుడ్డు కూడా ఒకటి. డాక్టర్లు సైతం మన ఆహారంలో ఒక కోడిగుడ్డు తీసుకోవాలని సూచిస్తారు. కోడుగుడ్డు లో అనేకమైన పోషక విలువలను కలిగి ఉంది. అయితే సాధారణంగా కోడి గుడ్డులోని పచ్చసొన అని చాలామంది తీసుకోరు అందుకు కారణం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండడమే. అయితే అప్పుడప్పుడైనా కోడిగుడ్డులోని పచ్చసొన తినాలి అంటారు ఆరోగ్య నిపుణులు. ఎగ్ వైట్‌లో పుష్కలంగా ఐరన్ ఉంటుందని చాలా మందికి తెలియదు, ఇది రెడ్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది .

health-tips-about-eggs-eating-and-benefits
health-tips-about-eggs-eating-and-benefits

ఎగ్ వైట్‌లో ట్రేస్ మినరల్స్ మెగ్నీషియం మరియు ఫాస్పరస్‌లు కలిగి ఉన్నాయి.ఈ మినరల్స్ చర్మం అందానికి మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి.అయితే గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది భావిస్తారు. అయితే పచ్చి గుడ్లలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది బయోటిన్ గ్రహించకుండా నిరోధిస్తుంది. పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు.

 

బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం కంటే గుడ్డు ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. గుడ్డులో ఉండే కాల్షియం మహిళల ఎముకల దృఢత్వానికి చక్కగా సహాయపడుతుంది. అలానే మహిళల్లో ఓస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి బాగా సహాయ పడుతుంది. పురుషుల్లో హర్మోన్ టెస్టో‌స్టిరోన్ ఉత్పత్తికి ఇది ఎగ్ వైట్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఎగ్ వైట్ లో ఉండే విటమిన్ బి 12 ఆరోగ్యకరమైన నాడీ సంరక్షణ కొరకు అద్భుతంగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని తక్కువగా ఉన్నవారు గుడ్డును సేవించడం మంచిది.

Read Also : Makka Roti : మొక్కజొన్న రొట్టెతో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా…