Liger Movie Trailer Review : లైగర్ ట్రైలర్ ఆగయా.. విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే.. వీడియో!

Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh
Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh

Liger Movie Trailer Review : అమ్మాయిల డ్రీమ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్‌బీడ్) ట్రైలర్ వచ్చేసింది. మాస్ యాక్షన్ ట్రైలర్‌లో విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఇక లైగర్ నుంచి రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌కు జోడీగా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం విజయ్ ప్రాణం పెట్టాడనే చెప్పాలి.

Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh
Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లిమ్ప్స్, పోస్టర్స్‌లో విజయ్ మేకోవర్ గూస్ బంబ్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీ రోల్ చేశాడు. ఈ సందర్భంగా సుదర్శన్ థియేటర్స్ దగ్గర సందడిగా మారింది. దేవరకొండ అభిమానులు థియేటర్ దగ్గర ఫుల్ హంగామా చేస్తున్నారు. థియేటర్ వద్ద 75 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్.

Advertisement

Liger Movie Trailer Review : ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది.. లైగర్ వచ్చేస్తున్నాడు..

విజయ్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. టపాసులతో థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh
Liger Movie Trailer Review : Vijay Deverakonda Liger Movie Trailer Launch by Prabhas Director puri jagannadh

బుల్లెట్ దిగిందా లేదా..
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులతో మాట్లాడుతూ.. ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుందని అన్నాడు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న లైగర్ మూవీని మీకోసం కష్టపడి చేశానని చెప్పాడు. ఇందులో డ్యాన్స్ అంటే ఇష్టపడని తాను డ్యాన్స్ కూడా నేర్చుకున్నానని తెలిపాడు. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ విజయ్ ఫ్యాన్స్‌కు మరింత జోష్ ఇచ్చాడు. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్‌ను కొత్తగా చూస్తారని అన్నాడు. విజయ్ దేవరకొండ ఈ మూవీలో రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నాడు. తల్లి పాత్రలో మన శిమగామి రమ్యకృష్ణ కనిపించనుంది. ట్రైలర్‌లోనే తల్లీ కొడుకుల బాండింగ్ ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ రోజుల మాదిరిగా కనిపిస్తోంది. హీరో కిక్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు.

Advertisement

నేను పైటర్.. నేను ఏంటి మరి..
విజయ్ దేవరకొండ MMA టైటిల్‌ను ఎలా గెలుస్తాడు.. అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది ఈ ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. లైగర్ మూవీలో హీరోకి నత్తి ఉన్నట్టు చూపించారు. హీరోయిన్ అనన్య పాండే గ్లామర్, రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కిక్ బాక్సింగ్ చేస్తూ విజయ్ దేవరకొండ అండర్ వేర్‌తో చేసే డాన్స్ కిరాక్ అని చెప్పాలి. ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండ ‘నేను ఫైటర్‌ని’ అని చెప్పినప్పుడు, మైక్ టైసన్ ఎంట్రీ ఇచ్చి నువ్వు ఫైటర్ అయితే.. నేను ఏంటి మరి? అంటూ చెప్పిన డైలాగ్ సినిమాకే హైలెట్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పూరీ మార్క్.. విజయ్ దేవరకొండ కలిస్తే లైగర్.. బుల్లెట్ దింపేశారు.

Advertisement

Read Also : Liger new update: లైగర్ నుంచి న్యూ అప్ డేట్… ఆకలితో ఉన్నానంటూ పోస్ట్!

Advertisement