Three Bills Withdrawn : దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి చరిష్మా ఉన్న నాయకులే. ఇద్దరు అనేక సాహసోపేత నిర్ణయాలతో ప్రజాధరణను చూరగొన్నారు. కానీ ఈ ఇద్దరు నేతలకు మాత్రం మూడు విషయంలో అనుకోని కష్టమొచ్చి పడింది. అదే దేశ ప్రధాని ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు, ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మూడు రాజధానులు వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పోరాటాలు చేశారు. ప్రభుత్వం వారి పోరాటాలను ఎంతలా కట్టడి చేసేందుకు ప్రయత్నించినా కానీ ఆ రైతులు వెనక్కు తగ్గలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వమే ఒక అడుగు దిగొచ్చి ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ రైతులు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు వద్దంటూ అమరావతి చుట్టు పక్కల ఉన్న ప్రజలు చాలా రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు ఒక్కటేమిటి చాలా విధాల్లోనే తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పారు. అయినా కానీ వినిపించుకోని ప్రభుత్వం సడెన్ గా మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
మరలా సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎప్పుడు బిల్లును తీసుకొస్తారనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. విశేష ప్రజాధరణను సొంతం చేసుకున్న ఇద్దరు నేతలకు మూడు అనే నెంబర్ తోనే మూడిందని అందరూ భావిస్తున్నారు. ప్రజాధరణ ఉంటే ఏ చట్టాలైనా తీసుకురావచ్చని అభిప్రాయపడితే ఎలా ఉంటుందనే విషయం ఈ ఇద్దరు నేతలను చూసి నేర్చుకోవాలని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఎటు వైపు అడుగులేస్తాయో?
Read Also : CM KCR : మూడు రాజధానుల ముచ్చట కేసీఆర్కు ముందే తెలుసా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world