...

CM KCR : మూడు రాజధానుల ముచ్చట కేసీఆర్‌కు ముందే తెలుసా..?

CM KCR : మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు నిన్నటి అసెంబ్లీలో ప్రకటన వెలువడింది. మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతామని వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఉప సంహరించుకోవడంతో అనేక మంది సంబురాలు చేసుకుంటున్నారు. అదలా ఉంచితే .. అసలు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం ఇలా పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ తిరగడం ఏంటని అనేక మంది విమర్శిస్తున్నారు.

తెలంగాణ స్పీకర్ మనువరాలి పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఈ పెళ్లి వేడుక తర్వాతే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే పెళ్లి వేడుకలో జగన్ రెడ్డి ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పాడా అనే ప్రశ్న వస్తోంది. పెళ్లి వేడుకలో కూడా జగన్ , కేసీఆర్ పక్కపక్కనే కూర్చుని భోజనం చేశారు. అంతే కాకుండా విడిగా ఏకాంతంగా కాసేపు ముచ్చటించుకున్నారు.

కేసీఆర్ కు దగ్గరి వ్యక్తి అనేక మీడియా సంస్థల్లో పని చేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గా సేవలందిస్తున్న కట్టా శేఖర్ రెడ్డి కూడా ఈ విషయం పైనే ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతానికైతే ఏపీలో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. కానీ ప్రభుత్వం మరలా బిల్లు ప్రవేశపెడతామని చెప్పడంతో ఆ బిల్లులో కూడా మూడు రాజధానుల ప్రస్తావన వస్తుందేమో అని అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP BJP Secret Info : ఏపీ బీజేపీలో బయటపడుతున్న సీక్రెట్స్.. లీక్ చేస్తున్నది ఎవరంటే..?