AP BJP Secret Info : ఆంధ్రప్రదేశ్ బీజేపీలోంచి చాలా విషయాలు లీక్ అవుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి సంబంధించి సీక్రెట్‌గా ఉండాల్సిన అంశాలు సైతం మీడియాకు లీక్ అవుతున్నాయి. దీంతో వారు వీటిని ముద్రిస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈ లీకుల వెనక ఉన్నదెవరంటూ ఆ పార్టీ లీడర్స్‌లో చర్చ మొదలైంది. ఎవరో లీక్ చేయకుంటే ఇలాంటి విషయాలు మీడియాకు ఎలా తెలుస్తాయని ఆ పార్టీ నాయకులు చెబుతుండటం గమనార్హం.
అయితే ఈ విషయంపై పార్టీ సీరియస్‌గా దృష్టి సారించిందని సమాచారం. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా తిరుపతిలో పర్యటించారు. పర్యటన ముగిసిన తర్వాత లాస్ట్ డే పార్టీ లీడర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై పలు విషయాలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి? అందుకు సంబంధించిన వ్యూహాలు ఎంటి? ఇలా కీలక అంశాలపై సీక్రెట్‌గా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు జరిగిన రోజే మీటింగ్ పెట్టి పలు విషయాలను ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు అనుకున్నారు. కానీ అప్పటికే టైం అయిపోవడంతో అది కుదరలేదు.
అయితే తాను చెప్పాలని అనుకున్న విషయాలు మరుసటి రోజు మీడియాలో రావడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని తన సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడిన వీర్రాజు.. తాను చెప్పే అంశాలు మీడియాలో వచ్చాయని, కానీ చెప్పకూడని సీక్రెట్స్ సైతం మీడియాకు ఎలా తెలిశాయని చెప్పుకొచ్చారట. అయితే ఓ వర్గానికి మీడియాలో మాత్రమే ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారట. ఓ సామాజిక వర్గానికి చెందిన లీడరే కోవర్డుగా వ్యవహరిస్తున్నడని వీర్రాజుకు సమాచారం అందిందట. దీంతో ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమిత్ షాకు సైతం వివరించారట వీర్రాజు.
Read Also : CM KCR : గులాబీ పార్టీకి గుబులు.. కేసీఆర్‌ను భయపెడుతున్న చోటా లీడర్స్..