...

CM KCR : గులాబీ పార్టీకి గుబులు.. కేసీఆర్‌ను భయపెడుతున్న చోటా లీడర్స్..

CM KCR : ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించి 12 స్థానాలు ఖాళీ అవుతుండటంతో వాటిని తిరిగి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. డిసెంబర్ 10న ఎలక్షన్స్ సైతం నిర్వహించనున్నారు. ఈ టైంలోనే గులాబీ బాస్ కు టెన్షన్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను భయపెడుతున్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతుండటంతో ఆ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంది.

దీంతో ఎంపీటీసీలు ఈ ఎన్నికల్లో తమ సత్తాను చూపాలనుకుంటున్నారు. వీరిలో ముఖ్యంగా ఎంపీటీసీలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. వీరిలో కొందరు ఏకంగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రబుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఇలా కోపానికి గురి అవుతుండటంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారు.

తమ గౌరవవేతనం రూ.15 వేలకు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ.. మరి కొన్ని డిమాండ్లను సైతం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో తమకు గౌరవ స్థానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందుకు ఎంపీటీసీల నుంచి ఇలా వ్యతిరేకత వస్తుండటంతో టీఆర్ఎస్ పెద్ద లీడర్లు రంగంలోకి దిగి వారితో చర్చలు జరుపుతున్నారు.

కానీ, ఈ చర్చలు ఇంకా సఫలం కాలేదట. దీంతో ఎంపీటీలు నామినేషన్స్ వేయాలని డిసైడ్ అయినట్టు టాక్. అయితే మొత్తంగా 12 స్థానాలకు గెలుచుకునే బలం టీఆర్ఎస్‌కు ఉంది. కానీ ఎంపీటీసీలు ఎన్నికల బరిలో ఉంటారనే టాక్ వస్తుండటంతో టీఆర్ఎస్ ఆలోచనలో పడింది. టీఆర్ఎస్ తరపున బరిలో ఉంటున్న అభ్యర్థులకు వారు ఓటేయకుంటే పరిస్థితి ఏంటనే గుబులు అధికార పార్టీలో మొదలైంది. మరి పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.

Read Also : Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని..