Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Chandrababu : లీడర్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. వారికి  నో చాన్స్ అంటూ క్లారిటీ..

Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి నాయకులకు సైతం ఓవైపు దిశానిర్దేశం చేస్తూ మరో వైపు వార్నింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ లీడర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తన పార్టీ లీడర్లకే సీరియస్ వార్నింగు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ... Read more

By Vinod Kumar

Published on: November 28, 2021 2:24 PM

Updated on: November 28, 2021 2:27 PM

chandrababu-naidu-serious-warning-to-tdp-leaders

---Advertisement---

Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి నాయకులకు సైతం ఓవైపు దిశానిర్దేశం చేస్తూ మరో వైపు వార్నింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ లీడర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తన పార్టీ లీడర్లకే సీరియస్ వార్నింగు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

జమ్మలమడుగులోని మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కొడుకు భూపేశ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ టైంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎలక్షన్స్‌ టైంలో పార్టీలు మారుతున్న లీడర్లకు అదరిపోయే వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికే తప్ప వలసలను నమ్ముకునే వారికి వచ్చే ఎలక్షన్స్‌లో టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం హల్ చల్ అవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామంటూ స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు పార్టీలో చేరే నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదన్నారు. దీంతో వచ్చే ఎలక్షన్స్ టైం వరకు టీడీపీలో చేరాలని భావిస్తున్న వారికి చంద్రబాబు చేసిన కామెంట్స్ షాక్ ఇవ్వనున్నాయి. పార్టీలో ఎవరెవరు పనిచేస్తున్నారనే లెక్కులు వేసుకుంటున్నారు బాబు. పార్టీ కోసం పని చేయకుండా ఉన్న వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు విన్న నాయకుల్లో భయం మొదలైంది. పార్టీలో పనిచేసే వారికే మొదటి ప్రియారిటీ వారి తర్వాతే వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. మరి వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also : CM KCR Delhi Tour : ఢిల్లీకి వెళ్లి అమీతుమీ తేల్చుకుని వస్తానన్న కేసీఆర్.. ఏం సాధించారు?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!