Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026లో వన్‌ప్లస్ 15పై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను అసలు ధరకే కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

By Ramesh Babu

Published on: August 6, 2026 3:59 PM

Updated on: August 6, 2026 3:59 PM

Amazon Great Freedom Sale

---Advertisement---

  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026లో వన్‌ప్లస్ 15పై భారీ తగ్గింపు
  • HDFC బ్యాంక్, అమెజాన్ పే ICICI బ్యాంక్ కార్డులపై అదనపు ఆఫర్లు
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 7300mAh బ్యాటరీ, హాసెల్‌బ్లాడ్ కెమెరా

Amazon Great Freedom Sale : మీరు వన్‌ప్లస్ 15 కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 సమయంలో అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. పెరుగుతున్న మెమరీ ఖర్చులను కారణంగా కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచింది.

ఇప్పుడు, అమెజాన్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో ప్రస్తుత ధర కన్నా తక్కువ ధరకు (Amazon Great Freedom Sale) కొనేసుకోవచ్చు. కస్టమర్‌లు HDFC బ్యాంక్ కార్డ్‌లు, అమెజాన్ పే ICICI బ్యాంక్ కార్డ్‌లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

Advertisement

అమెజాన్ టీజర్ ప్రకారం.. వన్‌ప్లస్ 15 ఫోన్ 12GB + 256GB వేరియంట్ సేల్ సమయంలో రూ. 81,999 ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ధర బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. ప్రస్తుతం అసలు ధర అమెజాన్ ప్రకారం రూ. 89,999తో పోలిస్తే కొనుగోలుదారులు రూ. 8వేల వరకు సేవింగ్ చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 15 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, EasyEMI లావాదేవీలపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే పేమెంట్లపై 5శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. కస్టమర్‌లు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ అసలు ధర నుంచి మరింత తగ్గింది.

Read Also : Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

వన్‌ప్లస్ 15లో 6.78-అంగుళాల FHD+ (1,272×2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. 1 నుంచి 165Hz రిఫ్రెష్ రేట్ మధ్య మారగలదు. 1800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. BOE ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED ప్యానెల్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌కు సపోర్టు చేస్తుంది.

Advertisement

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపర్చర్, OISతో 50MP మెయిన్ సెన్సార్ ఉంది. ఈ సెటప్‌లోని ఇతర కెమెరాలలో f/1.8 అపర్చర్, OIS సపోర్టుతో 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, f/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ 15లో హస్సెల్‌బ్లాడ్-ట్యూన్డ్ సిస్టమ్ కూడా ఉంది. 8K రిజల్యూషన్ వరకు వీడియోను రికార్డ్ చేయగలదు. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్‌లో f/2.4 అపర్చర్‌తో 32MP షూటర్ ఉంది.

వన్‌ప్లస్ 15 ఫోన్ భారీ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 7300mAh బ్యాటరీతో వస్తుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మాగ్నెట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, NFC, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ వన్‌ప్లస్ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ ఉంది. కొలతలు 161.42×76.67×8.10mm, బరువు 211 గ్రాములు ఉంటుంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :