- శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఆగష్టు 3న భారత్‌లో లాంచ్
- 50MP కెమెరా, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ధర రూ. 25,999కు లభ్యం కానుంది
Samsung Galaxy F70 Pro Launch : శాంసంగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు ఫస్ట్ వీక్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ మైక్రో-సైట్‌ను కూడా క్రియేట్ చేసింది.
లాంచ్ ముందే ఫోన్ అన్ని స్పెసిఫికేషన్లు, ధరను లైవ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే ప్యానెల్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G లాంచ్ తేదీ, ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ శాంసంగ్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో బేస్ (Samsung Galaxy F70 Pro Launch) వేరియంట్ రూ. 25,999 ప్రారంభ ధరతో లాంచ్ కానుంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో సెకండ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంటుంది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్ రూ. 34,999 ధరకు లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G మైక్రోసైట్‌లో రిటైల్ ధరలు రివీల్ అయ్యాయి. ఆగస్టు 3వ తేదీన కంపెనీ డిస్కౌంట్లతో లాంచ్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఫోన్ ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ ఫుల్-HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఫోన్ సెకండరీ కెమెరా సెటప్‌లో 2MP మాక్రో కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా మాడ్యూల్‌లో LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో HDR సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.













