Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 25,999 నుంచి లభ్యమవుతుంది.

By Ramesh Babu

Published on: August 3, 2026 11:59 PM

Updated on: August 3, 2026 11:59 PM

Samsung Galaxy F70 Pro 5G Launched With AI Features: Price, Specifications

---Advertisement---

  • శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ప్రారంభ ధర రూ. 25,999 మాత్రమే
  • స్నాప్‌డ్రాగన్ 6వ జనరేషన్ 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ
  • 50MP ట్రిపుల్ కెమెరా, 6 ఏళ్ల పాటు అప్‌డేట్స్ అందుబాటులో

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ కొత్త గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. గెలాక్సీ AI ఫీచర్లతో పాటు, 6 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 25,999 నుంచి (Samsung Galaxy F70 Pro 5G) ప్రారంభమవుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్లు కూడా వరుసగా రూ. 29,999, రూ. 34,999 ధరలతో లభిస్తాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 23,999 ప్రారంభ ధరకే కొనేసుకోవచ్చు. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్పెసిఫికేషన్లు :

ఈ శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. కంపెనీ 6 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్, 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో రన్ అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G కెమెరా ఫీచర్లు :

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 12MP HDR సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ AI ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5Gలో 6000mAh భారీ బ్యాటరీని అమర్చింది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్, 8 గంటలకు పైగా గేమింగ్, 12 గంటల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయగలరని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, జెమిని వాయిస్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, డైరెక్ట్ వాయిస్‌మెయిల్, నౌ బార్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :