Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు సీరియల్ నటి అమూల్య గౌడ (మీనా) తన ప్రియుడు నిరంజన్ బి.ఎస్‌ను అధికారికంగా అభిమానులకు పరిచయం చేశారు. వీరిద్దరూ కలిసి కొత్త యూట్యూబ్ ఛానెల్‌ కూడా మొదలుపెట్టారు.

By Ramesh Babu

Published on: July 31, 2026 11:52 PM

Updated on: August 3, 2026 9:15 AM

Amulya Gowda with boyfriend Niranjan BS

---Advertisement---

  • గుండెనిండా గుడిగంటలు సీరియల్
  • నటి అమూల్య గౌడ ప్రియుడి ఎవరో చెప్పేసింది
  • నిరంజన్ బి.ఎస్‌, మీనా లవ్ స్టోరీ రివీల్

Actress Amulya Gowda : తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సీరియల్ అమూల్య గౌడ్ ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌ ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ లో మీనా రోల్ ద్వారా నటి అమూల్య గౌడ మళ్లీ వార్తల్లో నిలిచారు. తనదైన నటనతో మంచి (Actress Amulya Gowda) గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ బ్యూటీ ఈసారి పర్సనల్ లైఫ్ సంబంధించిన అద్భుతమైన విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

కన్నడ బుల్లితెరపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ సీరియల్స్‌లో అమూల్య గౌడ నటించింది. ప్రస్తుతం తెలుగులోనూ వరుస సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ‘గుండె నిండా గుడిగంటలు’లో ఆమె పోషిస్తున్న మీనా రోల్ కు కూడా ఆడియోన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

గత కొన్నాళ్లుగా నటి అమూల్య గౌడ లవ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నాయి. కన్నడలో ప్రసారమైన సూపర్ హిట్ ‘కమలి’ సీరియల్‌లో తనతో కలిసి నటించిన నటుడు నిరంజన్ బి.ఎస్‌తో ఆమె రిలేషన్‌లో ఉందంటూ రుమర్లు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై ఇప్పటివరకు అమూల్య స్పందించలేదు. లేటెస్టుగా ఆమె స్వయంగా తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేసింది.

Actress Amulya Gowda :  కమలి’ సీరియల్ టైంలో పరిచయం :

ఫస్ట్ ‘కమలి’ సీరియల్ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. బుల్లితెరపై ఈ జంటకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. రియల్ లైఫ్ ఇద్దరూ కలిసి కనిపించడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరి రిలేషన్ గురించి ఫ్యామిలీ మెంబర్లకు కూడా తెలుసని, వారు కూడా ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, సీరియల్ నటి అమూల్య గౌడ తన బాయ్ ఫ్రెండ్ నిరంజన్‌తో కలిసి కొత్త యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ప్రోమో వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Amulya Gowda with boyfriend Niranjan BS
Actress Amulya gowda గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

ఈ వీడియోను చూసిన వారిద్దరి అభిమానులు కూడా విషెస్ చెబుతున్నారు. తమ పర్సనల్ లైఫ్ సంబంధించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు, పలు స్పెషల్ వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేస్తున్నారు.

Advertisement

నిరంజన్ బీఎస్ కూడా కన్నడ టెలివిజన్‌లో అనేక టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం అమూల్య-నిరంజన్ జోడీ రీల్ లైఫ్‌ మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తెలుగు సహా కన్నడ ఫ్యాన్స్ అమితంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ ఫొటోలను షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె సీరియల్ అభిమానులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. కొత్త యూట్యూబ్ ప్రయాణం మరింత సక్సెస్ అవ్వాలని కామెంట్లు పెడుతున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. అవసరమైన సందర్భాల్లో ఏఐ అందించే అదనపు సమాచారాన్ని డ్రాఫ్ట్‌గా ఉపయోగిస్తాం. పబ్లిష్ చేయడానికి ముందు మా ఎడిటోరియల్ టీమ్ కంటెంట్‌ను రివ్యూ చేస్తుంది. సమాచారం మారే అవకాశం ఉన్నందున, తాజా అప్‌డేట్స్ కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. ఆరోగ్యం, ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే; ఇది నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.