Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Virosh Wedding Twist : విరోష్ వెడ్డింగ్ బిగ్ ట్విస్ట్, ఒకేరోజు 2 సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ రష్మిక, ఎందుకంటే?

Virosh Wedding Twist : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ జంట ఒకేరోజు రెండు సార్లు వేర్వేరు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోనుంది. అది ఎలాగంటే?

By Ramesh Babu

Published on: February 25, 2026 12:20 AM

Updated on: February 25, 2026 12:43 AM

Virosh Wedding Twist

---Advertisement---

  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి
  • ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో జరగనున్న విరోష్ వెడ్డింగ్
  • ఒకే రోజున వేర్వేరు సంప్రదాయాల్లో రెండు సార్లు వివాహం
  • హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసిన విరోష్ జంట
  • తెలుగు సంప్రదాయంలో ఒకసారి, కొడువలో రెండోసారి పెళ్లి

Virosh Wedding Twist : టాలీవుడ్ స్టార్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ నగరంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఇదే విషయాన్ని ఈ జంట ఇన్ స్టా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుత టాలీవుడ్ సమాచారం ప్రకారం.. తెలుగు, కర్ణాటక(కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు.

ముందుగా ఉదయం తెలుగు సంప్రదాయంలో ఒకసారి వివాహం చేసుకోనున్నారు. అదే రోజున సాయంత్రం కొడువ సంప్రదాయంలో రెండోసారి పెళ్లి చేసుకోనున్నారు. మార్చి 3న హైదరాబాద్‌లో తాజ్ కృష్ణలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్‌షిప్ గురించి ఎప్పటినుంచో ఊహాగానాలు వస్తున్నాయి. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంట. కానీ, ఎప్పుడూ కూడా ఇద్దరూ ఈ వార్తలపై నేరుగా స్పందించలేదు. అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందరూ ఊహాగానాలకు తెరదించుతూ ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయారు.

Virosh Wedding Twist : ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో పోస్టు వైరల్ :

అంతటితో ఆగలేదు.. ఇన్‌స్టా ద్వారా ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అనే పేరుతో పోస్టు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయ్, రష్మిక ఉదయ్ పూర్‌కు హైదరాబాద్ నుంచి​ బయలుదేరారు. విజయ్, రష్మిక హైదరాబాద్ రాకతో సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Virosh Wedding Twist
Virosh Wedding Twist ( Image Credit to Original Source )

ఒకేరోజు రెండు సార్లు పెళ్లి :

రష్మిక, విజయ్ దేవరకొండ ఒకేరోజు రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారట. కర్ణాటక (కొడువ), తెలుగు సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారట. సంగీత్, హల్దీ వేడుకలు, మెహందీ వేడుక కూడా జరగనుంది.

Read Also : PM Kisan Yojana : రైతులకు భారీ గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

Advertisement

ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. 5వ రోజు సాయంత్రం కొడువ సంప్రదాయంలో పెళ్లి చేసుకోనుంది. రష్మిక, విజయ్ ఇద్దరూ ఫిబ్రవరి 27న తిరిగి హైదరాబాద్ రానున్నారు. 2018లో ఫస్ట్ టైం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీలో కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

అప్పట్లో ఈ మూవీ కూడా భారీగా హిట్ అయింది. అయితే, ఈ సినిమా షూటింగ్ అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని టాక్ నడిచింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ మూవీతో మళ్లీ ఇద్దరూ మెరిసారు. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, రష్మిక, విజయ్ డేట్ చేస్తున్నారంటూ తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

FAQs : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లిపై ఎక్కువ అడిగే ప్రశ్నలివే :

1. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఒకే రోజులో రెండుసార్లు వివాహం ఎందుకంటే?

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వేర్వేరు సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించి రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు. అందులో ఒకటి తెలుగు వివాహ ఆచారాల ప్రకారం పెళ్లి, రెండోసారి కన్నడ కొడవ ఆచారాల ప్రకారం పెళ్లి. ఈ రెండు కుటుంబాలు సంప్రదాయాలను గౌరవిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు.

2. “విరోష్ వెడ్డింగ్” ప్రత్యేకత ఏంటి? ఈ పేరు ఎందుకు ఎలా వచ్చింది?

అభిమానులు ముద్దుగా పిలిచే విరోష్ అనే పేరునే తమ వెడ్డింగ్ పేరుగా పెట్టుకున్నారు. మీడియా కూడా ప్రత్యేకమైన పెళ్లిని “విరోష్ వెడ్డింగ్ ” అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. వ్యక్తిగత ఆచారాలను రెండు సంస్కృతుల సాంప్రదాయ ఆచారాలతో పెళ్లి జరుగనుంది.

3. విజయ్, రష్మిక పెళ్లి వేడుకలు ఎక్కడ జరగనున్నాయి?

హైదరాబాద్ (తెలుగు వేడుక), కొడువ ప్రాంతంలో (కన్నడ కొడవ వేడుక) ప్రైవేట్, హైప్రొఫైల్ వేదికలలో వివాహం జరగనుంది. ఈ రెండు సార్లు వివాహా వేడుకలు సన్నిహితంగానే కాకుండా విలాసవంతంగా జరగనున్నాయి.

4. విజయ్, రష్మిక ఒకే రోజులో రెండుసార్లు వివాహంపై ఫ్యాన్స్ ఎలా స్పందించారు?

ఒకే రోజున రెండు సార్లు పెళ్లి అనగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇరు కుటుంబాల సంప్రదాయాలను గౌరవిస్తూ చేసుకుంటున్న పెళ్లికి అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలతో వైరల్ చేస్తున్నారు.

5. విజయ్, రష్మిక రిసెప్షన్ ఎక్కడ జరగనుంది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ నగరంలో పెళ్లి వేడుక జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సెలబ్రిటీలు, ఇరు కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుగనుంది.

విజయ్-రష్మిక పెళ్లి పేరు ఏం పెట్టారు?





, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.