Coolie Box Office Collections : 3వ రోజు ‘కూలీ’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజనీకాంత్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

Coolie Box Office Collections Day 3 : రజనీకాంత్ సినిమా కూలీ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది. ఈ సంవత్సరం విడుదలైన మరే సినిమా కూడా ఇంత ఘనత సాధించలేదు.

Updated on: August 16, 2025

Coolie Box Office Collections Day 3 : సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ సినిమాకు ‘తలైవర్’ అని ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

దేశమంతటా కేవలం 3 రోజుల్లోనే రూ. 118.5 కోట్ల నికర వసూళ్లను సాధించిందని సాక్నిల్క్ రిపోర్టు వెల్లడించింది. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలో నటించారు.

Coolie Box Office Collections : కూలీ సినిమా వసూళ్ల సునామీ :

మొదటి రోజు రూ.65 కోట్లతో ప్రారంభమైంది. తమిళంలో రూ.44.5 కోట్లు, తెలుగు రూ.15.5 కోట్లు, హిందీ రూ.4.5 కోట్లు, కన్నడ రూ.50 లక్షలు కలెక్షన్లు సాధించింది. 2వ రోజు స్వల్పంగా తగ్గి రూ.53.5 కోట్లకు చేరినప్పటికీ, అదే జోరు కొనసాగించింది. 3వ రోజు ముగిసే సమయానికి కూలీ ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటింది.

Advertisement

Read Also : POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్‌ చూశారా? 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర కూడా చాలా తక్కువే

ఇప్పుడు 3 రోజుల్లో మొత్తం కలెక్షన్లు రూ.118.5 కోట్లు దాటేసింది. థియేటర్ల నుంచి ట్రెండింగ్ వరకు ‘కూలీ’ మానియా దేశమంతటా థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో దర్శనమిస్తున్నాయి. అభిమానులు కూలీ స్క్రీనింగ్‌లను పండుగల్లా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతం కావడంతో కూలి మూవీకి మరింత వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ‘కూలీ’ మొదటి వారంలోనే రూ. 150 కోట్ల మార్కును అధిగమించవచ్చు.

Coolie Box Office Collections : కూలీ కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్కు :

రజనీకాంత్ సినిమా కూలీ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది. ఈ సంవత్సరం విడుదలైన మరే సినిమా కూడా ఇంత ఘనత సాధించలేదు. ఈ ఏడాది విడుదలైన హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలు కూడా రెండు రోజుల్లో ఈ సంఖ్యను చేరుకోలేకపోయాయి. విక్కీ కౌశల్ ‘చావా’, అహన్ పాండే ‘సైయారా’ కూడా వెనుకబడ్డాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel