- బిగ్ బాస్ 10లోకి నందన ఎంట్రీ.. వారానికి రూ. 2 లక్షలు రెమ్యునరేషనా?
- లండన్ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు నందన జర్నీ..
- 28 లక్షల సబ్‌స్క్రైబర్ల నుంచి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వరకు.. నందన స్టోరీ
Bigg Boss Telugu 10 : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ నందన పేరు ఇప్పుడు మరో కారణంతో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది నిజమేనా అన్న దానిపై స్పష్టత లేకపోయినా, నెటిజన్ల మధ్య మాత్రం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
‘నందూస్ వరల్డ్’ పేరుతో వీడియోలు చేస్తూ నందన సొంతంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఛానల్‌కు దాదాపు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు లండన్‌లో ఉంటూ కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె, ఈ సంక్రాంతికి విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో క్యామియో వేషంలోనూ కనిపించారు.
వివాదాల్లో నందన ప్రయాణం
అయితే ఇటీవలి కాలంలో నందన పేరు మంచి కారణాలకు కాకుండా, ఆరోపణల (Bigg Boss Telugu 10) వల్లే ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి, భర్తతో కలిసి లక్షల రూపాయలు వసూలు చేసిందన్న ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆమెపై కేసులు నమోదు చేశారు.
Read Also : Actress Hema : బావగారు చిరంజీవి, బాయ్‌ఫ్రెండ్‌లా నాగార్జున.. హేమ సంచలన కామెంట్స్
దీంతో ఆమెపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఇండియాకు వచ్చి, హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కారు. బిగ్ బాస్‌లో అవకాశం వచ్చిందన్న కారణంగానే ఆమె హైదరాబాద్ వచ్చారని, ఆ క్రమంలోనే పోలీసుల కంట పడ్డారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది.
రెమ్యునరేషన్, వ్యతిరేకతల మధ్య చర్చ
కేసుల ఒత్తిడి మధ్యే నందనకు బిగ్ బాస్ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందని సమాచారం. వారానికి సుమారు రూ. 2 లక్షల చొప్పున చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలు వెలువడగానే సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి ఇంత భారీ అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగి, బిగ్ బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు హెచ్చరికలు జారీ చేశారు. నందనను షోలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
ఇంత వివాదం మధ్య బిగ్ బాస్ నిర్వాహకులు నిజంగానే నందనకు అవకాశం ఇస్తారా, లేదంటే ఒత్తిళ్లకు తలొగ్గి ఆ ప్రణాళికను విరమించుకుంటారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.













