Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10లో ఎంట్రీ.. శ్రీముఖి బాటలో వర్షిణీనా? యాంకర్ల హిస్టరీ రిపీట్ అవుతుందా?

Bigg Boss Telugu 10 : యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కెరీర్ నేపథ్యం, బిగ్ బాస్‌పై ఆమె అభిప్రాయాలు తెలుసుకోండి.

By Ramesh Babu

Published on: September 6, 2026 11:04 PM

Updated on: September 6, 2026 11:06 PM

Bigg Boss Telugu 10_ Anchor Varshini Sounderajan

---Advertisement---

  • చివరి నిమిషంలో మారిన నిర్ణయం.. బిగ్ బాస్ 10లో వర్షిణీ ఎంట్రీ
  • చందమామ కథలుతో మొదలై.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో వర్షిణీ
  • బిగ్ బాస్‌లో ఫిట్ అవుతానా అని డౌట్ పడ్డా.. వర్షిణీ ఓపెన్ టాక్
  • ప్రేమ పుకార్లు వెనక్కి.. కెరీర్ బౌన్స్ బ్యాక్ కోసం వర్షిణీ స్ట్రాటజీ

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లోకి స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చింది. ఇంతకుముందు వరుస సీజన్లు మొదలయ్యే ప్రతిసారీ ఆమె పేరు కంటెస్టెంట్ల జాబితాలో వినిపించేది, కానీ చివర్లో ఆమె పేరు లిస్ట్‌లో ఉండేది కాదు. ఇప్పుడు 10వ సీజన్‌లో ఎట్టకేలకు ఆమె కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టడం విశేషం.

గతంలో బిగ్ బాస్‌లోకి వెళ్లిన యాంకర్లలో శ్రీముఖి మాత్రమే రన్నరప్ వరకు వెళ్లి సత్తా చాటింది. ఇప్పుడు అదే బాటలో వర్షిణీ కూడా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలతో పాటు బుల్లితెరపైనా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ గ్లామరస్ యాంకర్‌పై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Advertisement

బిగ్ బాస్‌పై వర్షిణీ మనసులో మాట

తాను బిగ్ బాస్ హౌస్‌లో ఫిట్ అవుతానా లేదా అనే సందేహం తనను చాలాకాలం వెంటాడిందని వర్షిణీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు తనను తానే ఈ విషయమై ప్రశ్నించుకునేదాన్నని తెలిపింది. బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాట్‌ఫామ్ అని, అంత తేలిగ్గా అందులో ఇమడగలనా అని అనుమానం ఉండేదని వివరించింది. చివరకు ఈసారి కచ్చితంగా బిగ్ బాస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొంది.

సినిమాల నుంచి బిగ్ బాస్ దాకా ప్రయాణం

హైదరాబాద్‌లో స్థిరపడిన ఒక తమిళ కుటుంబంలో జన్మించిన వర్షిణీ, బుల్లితెరకు రాకముందే వెండితెర మీద కనిపించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన చందమామ కథలు చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం వంటి సినిమాల్లో నటించింది. పెళ్లి గోల వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా కూడా కనిపించింది.

Read Also : Bigg Boss Telugu 10 : అగ్ని పరీక్షలో మెరిసి.. ఆస్ట్రేలియా నుంచి బిగ్ బాస్ దాకా.. షాలినీ పటేల్ జర్నీ

యాంకర్‌గా, హోస్ట్‌గా బుల్లితెరపై కూడా వర్షిణీ మంచి పేరు తెచ్చుకుంది. ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్త్ సెన్స్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా వంటి షోలలో సందడి చేసింది.

సినిమాలు, టీవీ షోలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఆమె వార్తల్లో నిలిచింది. టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడుపుతోందని, అలాగే ఒక టీవీ షో డైరెక్టర్‌తో ప్రేమలో ఉందని కూడా ప్రచారాలు జరిగాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లుగానే తేలాయి.

ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు రెండింటికీ దూరంగా ఉన్న వర్షిణీ, ఇప్పుడు బిగ్ బాస్ వేదిక ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని ఆశిస్తోంది. హౌస్‌లో ఆమె ఎలాంటి గేమ్ ఆడుతుందో, శ్రీముఖి తర్వాత మరో యాంకర్‌గా సత్తా చాటుతుందో లేదో చూడాలి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.