Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Bigg Boss Telugu 10 : అగ్ని పరీక్షలో మెరిసి.. ఆస్ట్రేలియా నుంచి బిగ్ బాస్ దాకా.. షాలినీ పటేల్ జర్నీ

Bigg Boss Telugu 10 : అగ్ని పరీక్ష ఫేమ్ షాలినీ పటేల్ బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్, సెలక్షన్ డ్రామా వివరాలు తెలుసుకోండి.

By Ramesh Babu

Published on: September 6, 2026 10:51 PM

Updated on: September 6, 2026 10:51 PM

Bigg Boss Telugu 10 Shalini Patel

---Advertisement---

  • బిగ్ బాస్ 10లోకి షాలినీ పటేల్ ఎంట్రీ
  • నవదీప్ ఛాయిస్‌తో బిగ్ బాస్‌లోకి.. ఎవరీ షాలినీ పటేల్?
  • రీల్స్‌తో ఫేమస్ అయిన తెలుగమ్మాయి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో
  • ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. సెలక్షన్‌లో డ్రామా ఇదే

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్ అడుగుపెట్టింది. అగ్ని పరీక్ష సీజన్ 2లో తన సత్తా చాటిన ఆమె, ఇప్పుడు మెయిన్ షోలో మెయిన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హోస్ట్ నాగార్జున పంచ్ డైలాగులతో లాంఛ్ ఎపిసోడ్‌ను రక్తికట్టిస్తుండగా, హౌస్‌లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు మొదటిరోజే టాస్క్‌లు ఇస్తూ వారి ట్యాలెంట్‌ను పరీక్షిస్తున్నారు నిర్వాహకులు.

అగ్ని పరీక్ష సీజన్ నుంచి ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చారు. సింగర్ కమ్ రైతు బిడ్డ ఝాన్సీతో పాటు అప్‌కమింగ్ ఆర్టిస్ట్ అమన్ మసూద్ ఇప్పటికే హౌస్‌లో ఉన్నారు. తాజాగా ఇదే జాబితాలోకి షాలినీ పటేల్ కూడా చేరింది.

Advertisement

Bigg Boss Telugu 10 : సెలక్షన్‌లో డ్రామా

షాలినీ పటేల్ ఎంట్రీ వెనుక ఆసక్తికర పరిణామం జరిగింది. అగ్నిపరీక్షలో ఫైనల్ వరకు వెళ్లిన కంటెస్టెంట్లలో ఎవరో ఒకరిని ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంపిక చేసే అవకాశాన్ని నిర్వాహకులు నవదీప్‌కు ఇచ్చారు. అందరూ ఊహించని విధంగా నవదీప్ షాలినీ పటేల్ పేరును ప్రకటించారు. దీంతో గ్రాండ్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది షాలినీ.

ఎవరీ షాలినీ పటేల్

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగమ్మాయి షాలినీ పటేల్, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు తన గేమ్ ప్లాన్ గురించి ఆమె స్పష్టంగా మాట్లాడింది. స్ట్రాటజీతో ఆడతానని, సాధారణంగా తాను చాలా ఎక్కువగా మాట్లాడే వ్యక్తినని చెప్పింది. తానేంటో హౌస్‌లో అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేసింది.

Read Also : Bigg Boss Telugu 10 : గూగుల్‌లో నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్‌లో జబర్దస్త్ పొట్టి నరేష్ సంచలన కామెంట్స్

అగ్ని పరీక్షలో తన నటనతో, గేమ్‌ప్లేతో ఆకట్టుకున్న షాలినీ, ఇప్పుడు సెలబ్రిటీ కంటెస్టెంట్ల మధ్య ఎలా నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కామనర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఈ సీజన్‌లో, అగ్ని పరీక్ష నేపథ్యం ఉన్న కంటెస్టెంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మరి బిగ్ బాస్ హౌస్‌లో షాలినీ పటేల్ గేమ్ ఎలా సాగుతుందో చూడాలి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.