- త్రిగుణ్ దూకుడుకు హౌస్ లో హీట.. ఇంతలోనే వైల్డ్ కార్డ్ ప్లాన్
- సీరత్ కపూర్ నుంచి సౌందర్య రెడ్డి వరకు.. బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ లిస్ట్
- నాలుగు రోజుల్లోనే ట్విస్ట్ – బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త మొహాలు
- జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ కూడా బిగ్ బాస్ రేసులో?
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలై నాలుగు రోజులే అయినా, హౌస్ లో ఇప్పటికే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన ఈ సీజన్ లో పది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. వీరంతా బ్లూ టీమ్, రెడ్ టీమ్ గా చీలిపోయి గేమ్ ఆడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫిజికల్ టాస్కుల్లో దూసుకుపోతూ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కొద్ది రోజుల్లోనే హీరో అదిత్ అరుణ్, అలియాస్ త్రిగుణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మనసులో ఏముందో అదే మాట్లాడే అతని తత్వం హౌస్ లో చర్చనీయాంశంగా మారింది. రోహిత్ ను టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నా, త్రిగుణ్ ఇస్తున్న ఎంటర్ టైన్మెంట్ ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. కంటెస్టెంట్ల బలాబలాలపై పూర్తి అంచనాకు రావడానికి ఇంకా సమయం పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై క్లారిటీ
బిగ్ బాస్ ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ప్లాన్ సిద్ధమైనట్టు సమాచారం. మొత్తం 8 మంది కొత్త కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు నిర్ణయించారని, సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది.

అగ్ని పరీక్ష 2లో మెరిసిన దీపక్, మితిలేష్, రామకృష్ణ, అపూర్వలలో ఇద్దరిని మెయిన్ కంటెస్టెంట్లుగా తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. వీరిలో రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుండగా, బిగ్ బాస్ ఆడియెన్స్ కూడా అతని రాకను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మితిలేష్ కూడా రేసులో ఉన్నప్పటికీ, అపూర్వకు మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది.
సెలబ్రిటీల జాబితాలో లేడీసే ఎక్కువ
సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే, ఈసారి మహిళా కంటెస్టెంట్లదే పైచేయిగా కనిపిస్తోంది. హీరోయిన్ సీరత్ కపూర్ తో పాటు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫేమ్ సోనియా, ఆషిక వంటి వారు హౌస్ లోకి రానున్నారని టాక్ నడుస్తోంది. వీరికి తోడు సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి కూడా వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మేల్ కంటెస్టెంట్ల విషయంలో జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ లతో బిగ్ బాస్ టీమ్ మాట్లాడినట్టు, వీరు కూడా షోలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ 10 హౌస్ లో గేమ్ ఇంకా షేప్ తీసుకుంటున్న దశలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీల ప్రకటన అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్ లో సమీకరణాలు ఎలా మారతాయో, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల గేమ్ ప్లాన్ లపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. దీనిపై మరింత స్పష్టత త్వరలో రానుందని సమాచారం.












