- బంగారం కొనేవారికి అదిరే వార్త..
- వరుసగా తగ్గుతున్న గోల్డ్ ధరలు
- ఇప్పుడు బంగారం కొంటే లాభమే..
- భారీగా తగ్గిన 22, 24 క్యారెట్ల గోల్డ్ ధరలు
- ఒక్కరోజులోనే భారీ ఊరట.. ఎంత తగ్గిందంటే?
Gold and Price Today August 5 : బంగారం ప్రియులకు పండగే.. బంగారం కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం.. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా–ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల విధానంపై అనిశ్చితి ప్రభావంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తద్వారా బుధవారం (ఆగస్టు 5) బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు తులం బంగారం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Gold Price Today : బంగారం ధరలు ఎందుకు తగ్గాయంటే? :
బంగారం ధరలు రోజురోజుకీ దిగి వస్తున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలతో అమెరికా వడ్డీ రేట్లపై క్లారిటీ కోసం ఇంటర్నేషనల్ మార్కెట్లు ఆశగా చూస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో గత 2 ట్రేడింగ్ సెషన్లుగా ధరలు లిమిటెడ్ రేంజ్ లోనే కదులుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
దీని ప్రభావం దేశీయ గోల్డ్ ధరలపై పడింది. ఆగస్ట్ 5 నాటికి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,43,990గా ట్రేడ్ అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,31,990 వద్ద ట్రేడ్ అవుతుంది.
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఇవే :
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,990 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,990గా ఉంది. విజయవాడ నగరంలో కూడా ఇదే బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఢిల్లీలో స్వల్పంగా అధికంగా బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,44,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140గా నమోదైంది.
బెంగళూరు, చెన్నై, ముంబై, కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,43,990గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,990గా ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులతో రాబోయే రోజుల్లో పసిడి ధరల భారీగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా. గోల్డ్ కొనేవారు లేటెస్ట్ రేట్లను పరిశీలించి కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.













