Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (August 2, 2026) ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? 22K, 24K, 18K క్యారెట్ల గోల్డ్ రేట్లు, హైదరాబాద్‌లో వెండి ధరలు, కొనుగోలు చేసే ముందు దేశంలోని ప్రధాన నగరాల తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తప్పక తెలుసుకోండి.

By Ramesh Babu

Published on: August 2, 2026 8:30 AM

Updated on: August 2, 2026 8:30 AM

Gold Price Today in Telugu States – 22 Carat and 24 Carat Gold Rate

---Advertisement---

  • బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట
  • తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ తాజా రేట్లు ఇవే
  • ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు

Gold Price Today August 2, 2026 : బంగారం ప్రియులకు బంగారం లాంటి వార్త.. బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈరోజు బంగారం కొనడమే బెటర్.. ఆగస్టు 2న ఆదివారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులేదు. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో పరుగులు పెట్టిన బంగారం కాస్త బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది.

వరుసగా పెరుగుతూ సామాన్యులకు బంగారం భారంగా మారింది. కానీ, అదే బంగారం ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో బంగారం కొనేందుకు చూస్తున్న భారతీయ కుటుంబాలకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.

Advertisement

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,32,200గా ట్రేడ్ అవుతోంది. అలాగే, ప్యూరిటీ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,44,220 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,160గా ట్రేడ్ అవుతోంది.

Gold Price Today : ఈరోజు కిలో వెండి ధర ఎంతంటే? :

మరోవైపు, ఈరోజు వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.2,349 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,34,900గా ట్రేడ్ అవుతోంది.

వెండి ఆభరణాలు లేదా పూజా సామగ్రి కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఈరోజు బంగారం ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,44,370 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,250గా నమోదైంది.

అలాగే, చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,44,610 నమోదవ్వగా, 22 క్యారెట్ల బంగార ధర రూ.1,32,560గా నమోదైంది. బెంగళూరులో కూడా తెలుగు రాష్ట్రాల మాదిరిగానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,200గా ట్రేడ్ అవుతోంది.

Advertisement

Read Also : PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

బంగారం ధరలపై మార్కెట్ నిపుణుల అంచాలను పరిశీలిస్తే.. డాలర్ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా మార్పులు వస్తుంటాయి. రోజువారీగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తుంటాయి.

అందుకే బంగారం లేదా వెండి కొనుగోలు చేసేవారు ముందుగా హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే ఎంచుకోవడం ఎంతైనా మంచిది. అలాగే, మీరు బంగారం తీసుకున్న బిల్లు కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. బంగారంపై 3 శాతం జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు ఎంత వసూలు చేస్తున్నారో కూడా తప్పనిసరిగా చెక్ చేయడం ఎంతైనా బెటర్..

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.