- ఏపీ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఫసల్ బీమా యోజన నమోదు గడువు పొడిగింపు
- జూలై 31తో ముగిసిన ఫసల్ బీమా గడువు
- మరో 15 రోజుల పొడిగించిన కేంద్రం
PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో రిజిస్టర్ చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. గతంలో నిర్ణయించిన చివరి గడువును మరోసారి పొడిగించింది. ఈసారి ఆగస్టు 15 వరకు రైతులకు అవకాశం ఇచ్చింది. ఫసల్ బీమా యోజన కోసం ఇప్పటివరకూ నమోదు చేయలేని అర్హులైన రైతులందరూ మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గతంలో మిస్ అయిన రైతులంతా ఇప్పుడు ఈ గడువు ముగిసేలోగా అప్లయ్ చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.
మరో 15 రోజులు గడువు పొడిగింపు :
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం బీమా సంస్థలతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఈ దిశగా నిర్ణయాన్ని వెల్లడించింది. ముందుగా జులై 31తో గడువు ముగిసింది. మరో 15 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దాంతో రైతులకు మరింత సమయం లభించినట్టయింది. ముఖ్యంగా గడువు తేదీ సమయంలో సర్వర్ సమస్యల కారణంగా అప్లయ్ చేయలేకపోయినా రైతులందరికి బిగ్ రిలిఫ్ అని చెప్పొచ్చు.
Read Also : Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట రుణాలు తీసుకున్న రైతులే కాదు.. లోన్లు తీసుకోని అర్హులైన రైతులు కూడా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), డిజిటల్ సర్వీసు సెంటర్ల ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైతులు నిర్దేశించిన ప్రీమియం డబ్బులు కడితే మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి అనమాట.
PM Fasal Bima Yojana : ఈ రైతులందరికి బీమా పరిహారం :
ఈ బీమా పథకం కింద అధిక వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్ల వాన, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లిన రైతుల్లో అర్హులైనవారికి బీమా పరిహారం అందుతుంది. అంతేకాదు.. పంట నష్టాల సమయంలో లబ్ధిదారు రైతులకు ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.
ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న వాతావరణ ఆధారిత పంట బీమా పథకం గడువు జూలై 31తోనే ముగిసింది. ఈ పథకం ఎంపిక చేసిన 7 పంటలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి చేసినప్పటికీ బీమా సంస్థలు అందుకు అంగీకరించలేదు. అయితే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు మాత్రమే ఆగస్టు 15 వరకు గడువు పొడిగించారు. తద్వారా రైతులకు భారీ ఊరటనే చెప్పాలి.
ఎవరైతే రైతులు అర్హులో వారంతా లాస్ట్ డేట్ వరకు ఆగొద్దు.. ఎంత వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయడమే బెటర్ అంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియకు ప్రీమియం కూడా చెల్లించాలని చెబుతున్నారు. డెడ్ లైన్ ముగిశాక దరఖాస్తులకు మళ్లీ చాన్స్ దొరకదని వ్యవసాయ అధికారులు తేల్చి చెప్పారు.













