Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey: తెలంగాణలో ఓటర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు ఈ గడువును పొడిగించింది. ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించని వారికి మరో అవకాశం లభించింది.

By Ramesh Babu

Published on: August 1, 2026 11:56 AM

Updated on: August 1, 2026 11:56 AM

Telangana SIR Survey

---Advertisement---

  • తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌..
  • SIR సర్వే గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
  • ఎన్యూమరేషన్‌ ఫారాల గడువు పొడిగించిన ఈసీ
  • ఇంకా ఓటర్ రిజిస్టర్ చేసుకోలేదా? ఓటర్లకు మరో ఛాన్స్‌..
  • హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు మరింత సమయం..
  • SIR సర్వేపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Telangana SIR Survey : తెలంగాణలో ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ గడువును మళ్లీ పొడిగించింది. అర్హులైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా నిర్ణయం (Telangana SIR Survey) తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించేందుకు చివరి తేదీని ఆగస్టు 10 వరకు పొడిగించారు. ముందుగా ఈ ప్రాసెస్ గడువు జూలై 24తో ముగియాల్సి ఉంది. కానీ, ఆ తర్వాత ఆగస్టు 3 వరకు పొడిగించారు. తాజాగా రాష్ట్ర ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో మరింత మందికి అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం మళ్లీ గడువు పెంచింది.

77 శాతానికి పైగా పూర్తి :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా SIR ఎన్యూమరేషన్‌ ప్రాసెస్ ఇప్పటివరకు 77.12 శాతం పూర్తయినట్లు ఈసీ అధికారులు తెలిపారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా పూర్తికాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో రిజిస్టర్ శాతం తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 56.31 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం ఎన్యూమరేషన్‌ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అర్హులైన ఓటర్లు ఏం చేయాలి? :

గడువు పెంచిన తర్వాత ఇప్పటివరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించలేదా? అయితే మీకు మళ్లీ ఛాన్స్.. ఈసారి అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఫారాలు అందించని ఓటర్లు ఎవరైనా ఉంటే సమీప బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (BLO)ను సంప్రదించి తమ వివరాలను చెక్ చేసుకోవాలని తెలిపారు.

ఓటర్ల జాబితాలో పేరు, అడ్రస్ వంటి వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సర్ ప్రాసెస్ సంబంధించి మరింత అదనపు సమయం పొందవచ్చు. అర్హులైన ఓటర్లు జాబితాలో మరింత మంది తమ వివరాలను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.